corona: న‌టి సోద‌రుడిని బ‌లి తీసుకున్న క‌రోనా.. శోక‌సంద్రంలో ప్ర‌భ‌

పొద్దున లేస్తే క‌రోనా మ‌ర‌ణ వార్త‌లే వినిపిస్తున్నాయి. సినీ ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది కూడా క‌రోనా వ‌ల‌న మ‌ర‌ణిస్తున్నారు. తాజాగా ప్రముఖ ఎడిటర్, సీనియర్ నటి ప్రభ సోదరుడు NGV ప్రసాద్ కరోనాతో కన్నుమూసారు. 72 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో ఆయ‌న క‌న్నుమూయ‌డం కుటుంబ స‌భ్యుల‌ని ఎంత‌గానో బాధిస్తుంది. రిటైర్మెంట్ తీసుకుని పిల్లలు, మనవళ్లతో జీవితం ఎంజాయ్ చేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న ఇలా మ‌ర‌ణించడం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎన్జీవీ ప్ర‌సాద్ మ‌రెవ‌రో కాదు న‌టి ప్ర‌భ‌కు అన్న‌య్య‌. ఆమెకు ఇద్ద‌రు అన్న‌య్య‌లు ఉండ‌గా, ఇత‌ను చిన్న అన్న‌య్య‌.

కొన్ని రోజుల కింద కరోనా బారిన పడిన ఈయన.. మే 3న చెన్నై వెంకటేశ్వర ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ క‌న్నుమూసారు. 6 రోజులుగా చికిత్స పొందుతున్న ప్రసాద్.. పరిస్థితి విషమించడంతో మరణించారు. ఈయన పలు తెలుగు-తమిళ చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసారు. తెలుగులో లెజెండరీ దర్శకుడు కోదండరామి రెడ్డితో ఎక్కువ సినిమాలకు పని చేసారు. చిరంజీవి నటించిన సినిమాలకు కూడా బాగానే ఎడిట్ చేసాడు ప్రసాద్. తన అన్నయ్య ఆకస్మిక మరణం తట్టుకోలేకపోతున్నానని.. ఆయన మరణవార్త జీర్ణించుకోడానికి చాలా సమయం పడుతుందని చెప్పింది ప్రభ.