Sri Reddy : శ్రీరెడ్డికి పెండ్లి అయింది.. ఆమె భర్త ఎవరో కాదు.. ఎందుకు విడిపోయింది..?
NQ Staff - March 10, 2023 / 12:08 PM IST

Sri Reddy : తెలుగు ఇండస్ట్రీలో శ్రీరెడ్డి అంటే తెలియని వారు ఉండదు. కాంట్రవర్సీలకు ఆమె కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి కామెంట్లు చేస్తుందో చెప్పడం ఎవరి వల్ల కాదు. ఆమె ఏ హీరోలను కూడా వదలకుండా అందరి మీద అసభ్యకరమైన బూతులు మాట్లాడుతూ ఉంటుంది. అంతకు ముందు ఆమె హీరోయిన్ గా కూడా చేసింది.
కానీ హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆమె మీటూ ఉద్యమంతో ఫేమస్ అయిపోయింది. అప్పట్లో ఆమెకు మంచి క్రేజ్ వచ్చేసింది. కానీ ఎప్పుడైతే ఆమె కొందరు హీరోలను పర్సనల్ గా టార్గెట్ చేయడం మొదలు పెట్టిందో అప్పటి నుంచే ఆమెను అంతా పక్కన పెట్టేశారు. కానీ ఆమె మాత్రం తన ఆరోపణలు అస్సలు ఆపట్లేదు.
అసలు పేరు ఏంటంటే..?
అయితే శ్రీరెడ్డి గురించిన విషయాలు చాలామందికి తెలియదు. ఆమె అసలు పేరు శ్రీరెడ్డి కాదు విమల మల్లిడి. సాక్షిలో యాంకర్ గా చేస్తున్న సమయంలో ఆమె పేరును శ్రీలేఖ అంటూ పెట్టారు. ఆతర్వాత సినిమాల్లోకి వచ్చినప్పుడు తన పేరును శ్రీరెడ్డిగా మార్చేసుకుంది. అయితే ఆమెకు పెండ్లి కూడా అయింది.
ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆమె చిన్న వయసులో చెప్పినట్టు వినక పోవడం, బాగా అల్లరి చేస్తూ ఉండటంతో ఆమెకు 14 ఏళ్లకే ఓ వ్యక్తితో పెళ్లి చేసేశారు. కానీ అతనితో కాపురం చేయడం ఇష్టం లేని శ్రీరెడ్డి.. అతని నుంచి విడిపోయి ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్ వచ్చేసింది.