VAKEEL SAAB: వ‌కీల్ సాబ్ మానియా.. టిక్కెట్స్ కోసం హ్యాష్ ట్యాగ్స్‌తో అభిమానుల హ‌డావిడి

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌లో వ‌కీల్ సాబ్ మానియా న‌డుస్తుంది. ఏ న‌లుగురు దగ్గ‌ర చూసిన కూడా వ‌కీల్ సాబ్ గురించే చ‌ర్చ‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీఎంట్రీ మూవీ కావ‌డం, హిందీలో సూప‌ర్ హిట్ అయిన చిత్రానికి ఇది రీమేక్ కావ‌డంతో వ‌కీల్ సాబ్ మూవీపై అంచ‌నాలు బాగా ఉన్నాయి. ఏప్రిల్ 9న భారీ స్థాయిలో వ‌కీల్ సాబ్ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. క‌రోనా వ‌ల‌న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌తో పాటు ఎలాంటి ప్ర‌మోష‌న్ కార్యక్ర‌మాలు నిర్వ‌హించ‌కపోయిన కూడా వ‌కీల్ సాబ్ చిత్రం భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రుపుకుంటుంది. మ‌రోవైపు టిక్కెట్స్ కూడా హాట్ కేక్స్‌లా అమ్ముడు పోతున్నాయి. మ‌రో మూడు రోజుల వ‌ర‌కు మ‌ల్టీప్లెక్స్‌లు, సాధార‌ణ థియేట‌ర్స్‌లోను బుకింగ్స్ అన్నీ అయిపోయాయి.

మూడు రోజుల వ‌ర‌కు టిక్కెట్స్ దొర‌క‌ని ప‌రిస్థితులు ఏర్ప‌డిన నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో కొత్త హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. #VakeelSaabTicketsHelp అనే హ్యాష్ ట్యాగ్ తో పవన్ అభిమానులు నెట్టింట హడావుడి చేస్తున్నారు. ఎవరి వద్దనైనా ఎక్కువ టికెట్లు ఉన్నా లేదంటే ఎవరికైనా టికెట్లు కావాలన్నా కూడా ఈ హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేయడం చేస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా టిక్కెట్స్ వివ‌రాల‌ని ఒక‌రికొక‌రు షేర్ చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో #VakeelSaabTicketsHelp అనే హ్యాష్ ట్యాగ్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

అభిమానులు త‌మ అభిమాన హీరో సినిమా ఫ‌స్ట్ రోజు ఫ‌స్ట్ షో చూడాల‌ని ఎంతో అనుకుంటారు. కాని టిక్కెట్స్ దొర‌క‌పోతుండే స‌రికి వారు చాలా నిరాశ‌లో ఉన్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా అయిన టిక్కెట్స్ దొర‌కుతాయా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. వకీల్ సాబ్ ఎన్నో కొత్త ట్రెండ్ లను సృష్టించగా, ఇప్పుడు ఇది కూడా చేరింది. చూస్తుంటే రానున్న రోజుల‌లో స్టార్ హీరోల సినిమాలకు ఇలా టికెట్స్ హెల్ప్ చేసుకోవ‌డం అనేది ట్రెండ్‌గా మార‌నుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. వ‌కీల్ సాబ్ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న శృతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టించగా, నివేదా థామ‌స్, అన‌న్య‌, అంజ‌లి, ప్ర‌కాష్ రాజ్ ముఖ్య పాత్ర‌లు పోషించారు.

Advertisement