LOVE STORY: మెగాస్టార్‌తో పోటీ ప‌డేందుకు సిద్ధ‌మైన అక్కినేని హీరో.. బ‌రిలో నిలిచేదెవ‌రు?

LOVE STORY క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల‌న గ‌త ఏడాది సినీ ప‌రిశ్ర‌మకు తీవ్ర సంక్షోభం ఏర్ప‌డింది. దాదాపు తొమ్మిది నెల‌ల పాటు థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి,సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే ప‌రిశ్ర‌మ గాడిలో ప‌డుతుంది అనుకుంటుండ‌గా, క‌రోనా సెకండ్ వేవ్ విజృంభించ‌డంతో ఇంత‌క ముందు రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన చిత్రాలు మ‌ళ్లీ వాయిదాల బాట ప‌డుతున్నాయి. నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన రొమాంటిక్ డ్రామా చిత్రం ల‌వ్ స్టోరీ ఏప్రిల్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రావ‌ల‌సి ఉండ‌గా, క‌రోనా వ‌ల‌న మూవీని వాయిదా వేశారు.

సినీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ల‌వ్ స్టోరీ చిత్రాన్ని మే 13న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.. అదే రోజు చిరంజీవి ఆచార్య విడుద‌ల కానుండ‌గా, నిర్మాత‌లు డేర్ చేసి మ‌రీ ల‌వ్ స్టోరీ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాలి. అయితే ఇక్క‌డ చిన్న ట్విస్ట్ ఉంది. చిరంజీవి న‌టించిన ఆచార్య చిత్రం ఓ నెల పాటు వాయిదా ప‌డుతుంద‌ని కొన్నాళ్లుగా ప్ర‌చారం న‌డుస్తున్న నేప‌థ్యంలో ల‌వ్ స్టోరీ నిర్మాత‌లు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని కొంద‌రు అంటున్నారు. అస‌లు విష‌యం ఏంట‌నే దానిపై త్వ‌ర‌లో క్లారిటీ రానుంది.

Advertisement