Mahesh : మహేష్ మాస్ సాంగ్‌తో కొత్త రికార్డ్ ..!

Mahesh : మహేష్ బాబు మాస్ సినిమాలు చేసి చాలా ఏళ్ళవుతోంది. అంతక ముందు పోకిరి, బిజినెస్ మాన్, అర్జున్, ఒక్కడు లాంటి సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ రికార్డ్స్ అందుకున్నాడు. ఆ తరహా సినిమాలు వచ్చి చాలా ఏళ్ళవుతోంది. మహేష్ ఫ్యాన్స్ పోకిరి వంటి సినిమా కావాలని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి .. ఇలా వరసగా క్లాస్ సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు.

new record with mahesh-mass song...!
new record with mahesh-mass song…!

అయితే మహేష్ బాబు నటించిన గత చిత్రం సరిలేరు నీకెవ్వరుతో మళ్ళీ మాస్ సినిమా చేసి మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. వరస సక్సస్ లతో టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మారిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. దిల్ రాజు నిర్మించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబును. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న మాస్ సాంగ్‌లో చూపించాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

Mahesh : మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.

అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరులో మహేష్ ని చూపించిన విధానానికి అభిమానులు రెచ్చిపోయి ఎంజాయ్ చేశారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మాస్ సాంగ్‌ మహేష్ బాబు – రష్మిక మందన్న మాస్ స్టెప్స్ అదిరిపోయాయి. మైండ్ బ్లాక్ అంటూ సాగే ఈ సాంగ్‌లో మహేష్ మాసీ గెటప్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. కాగా ఈ సాంగ్ తాజాగా 100 మిలియన్స్ వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా క్రియేట్ అయిన ఈ రికార్డ్ తో మహేష్ మరోసారి మాస్ లో కనిపించాలను అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Advertisement