New Movie Update With Ramayanam Concept : రాముడిగా రణబీర్.. రావణుడిగా యష్.. మరో సంచలన న్యూస్..
NQ Staff - July 20, 2023 / 08:45 PM IST

New Movie Update With Ramayanam Concept :
ప్రతీ ఇండస్ట్రీలో కొంత మందికి డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి.. యాక్టర్స్ కు అయితే డ్రీమ్ రోల్స్ అని డైరెక్టర్స్ కు అయితే డ్రీమ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి.. మరి మన స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ఎలా అయితే మహాభారతం డ్రీమ్ ప్రాజెక్ట్ నో.. అలాగే అల్లు అరవింద్ కు రామాయణం తీయాలని డ్రీమ్.. ఇప్పటి వరకు రామాయణం ఆధారంగా రామాయణం కాన్సెప్ట్ తో డ్రీమ్ ప్రాజెక్టులు చాలానే వచ్చాయి..
అయినా కూడా అల్లు అరవింద్ రామాయణం తీయాలని ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతున్నాడు. ఇప్పటికే సీతారామ కళ్యాణం, లవకుశ, శ్రీరామరాజ్యం, ఆదిపురుష్ వరకు చాలా సినిమాలు రామాయణం ఆధారంగా తెరకెక్కాయి.. వీటిలో చాలా సినిమాలు అందరికి తెలిసిన కథే అయిన దాన్ని తెరకెక్కించే విధానం వేరు..
ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్.. మరి అల్లు అరవింద్, మధు మంతెన, నమిత మల్హోత్రాతో కలిసి రామాయణం నిర్మించాలని అనుకున్నారు.. ఎప్పుడో ప్రకటన చేసారు.. మూడేళ్లు గడుస్తున్న ఇప్పటికి ఈ సినిమా స్టార్ట్ కాలేదు. అయితే ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్నట్టు బాలీవుడ్ మీడియా చెబుతుంది..

New Movie Update With Ramayanam Concept
తాజా సమాచారం ప్రకారం రాముడిగా రణబీర్ కపూర్, సీతగా అలియా భట్, రావణుడి పాత్రలో యష్ ను ఫైనల్ చేసినట్టు వీరి మీద లుక్ టెస్ట్ చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది.. ఇదే నిజమైతే వీరి నటన ఓ రేంజ్ లో ఉంటుందని యష్ పెర్ఫెక్ట్ గా రావణుడి రోల్ లో సూట్ అవుతాడు అని అభిప్రాయ పడుతున్నారు. ఆదిపురుష్ దెబ్బతో మరింత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టు టాక్.. మరి వీరితో రామాయణం తీస్తే ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాల్సిందే..