Bigg Boss5: అప్పుడు బిగ్ బాస్‌లోకి పెళ్లైన జంట‌.. ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే జంట‌..!

Bigg Boss5:వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ ప్రీమియ‌ర్ షో బిగ్ బాస్ కార్య‌క్రమం అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్‌ఫుల్‌గా సాగుతుంది. ఈ కార్య‌క్ర‌మం తెలుగులో నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకోగా, ఇప్పుడు ఐదో సీజ‌న్ జ‌రుపుకునేందుకు సిద్ధ‌మైంది. కరోనా వ‌ల‌న ఈ కార్య‌క్ర‌మం రోజురోజుకు ఆల‌స్యం అవుతూ వ‌స్తుంది. గ‌త ఏడాది సెప్టెంబర్21న బిగ్ బాస్ షో ప్రారంభం కాగా, ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో సీజ‌న్ 5 ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుంది.

Bigg Boss 5
Bigg Boss 5

సీజ‌న్ 5కి సంబంధించి కొన్నాళ్లుగా అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సీజ‌న్‌కి హోస్ట్‌గా రానా ఉంటార‌ని, కంటెస్టెంట్స్‌గా ప‌లువురు టాలెంటెడ్ ఆర్టిస్ట్ హాజ‌ర‌వుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలో ఓ రొమాంటిక్ జంటను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపుతున్నట్టు సమాచారం. మూడో సీజన్‌లో పెళ్లైన వితిక-వరుణ్ సందేశ్‌లు జంటగా వెళ్లి బిగ్ బాస్ హౌజ్‌లో సంద‌డి చేయ‌గా.. ఈసారి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న శ్రీహాన్-సిరి హనుమంత్ జంటను బిగ్ బాస్ హౌస్‌కి పంపించబోతున్నారనేది లేటెస్ట్ అప్డేట్.

సిరి హ‌న్మంత్ మొద‌ట్లో యాంక‌ర్‌గా ప‌ని చేయ‌గా, ఆ త‌ర్వాత ఉయ్యాల జంపాల సీరియ‌ల్ ద్వారా బుల్లితెర‌పై సంద‌డి చేసింది. మోహిని, అగ్ని సాక్షి సీరియ‌ల్స్‌తో పాపుల‌ర్ అయిన సిరి కొన్నాళ్లుగా శ్రీహాన్ అనే ఆర్టిస్ట్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉంది. సిరి, శ్రీహాన్ కలిసి ‘సాఫ్ట్ వేర్ బిచ్చగాళ్లు’ షార్ట్ ఫిల్మ్‌‌తో పాపులర్ కాగా.. వీళ్లిద్దరూ కలిసి నటించిన రామ్ లీలా వెబ్ సిరీస్ బాగా పేరుతీసుకుని వచ్చింది.శ్రీహాన్- సిరి త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.

గ‌త ఫిబ్ర‌వరిలో ‘100 % లవ్’ అనే కార్యక్రమానికి జంటగా వచ్చిన ఈ ఇద్దరికీ నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించింది స్టార్ మా. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. రీసెంట్‌గా స్టార్ మ్యూజిక్ కార్య‌క్ర‌మానికి గెస్ట్‌గా వ‌చ్చింది ఈ జంట‌. ఇక ఇప్పుడు క‌లిసి బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళుతున్న‌ట్టు స‌మాచారం.

ఈ క‌పుల్ బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళితే ఆ సంద‌డి వేరే రేంజ్‌లో ఉంటుంది. అయిగే వ‌రుణ్- వితికల మ‌ధ్య స్టిక్స్ వేసిన బిగ్ బాస్ కాబోయే జంట‌ని కూడా ఇబ్బంది పెడ‌తాడా అని రానున్న రోజులలో తెలియ‌నుంది. ఈ సారి బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో క‌మెడీయ‌న్ అలీ, డ్యాన్స్ మాస్ట‌ర్ శేఖర్, అన‌సూయ ప‌లువురు ప్ర‌ముఖులు కూడా పాల్గొన‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.