Manchu Manoj : పెండ్లికి పిలిస్తే.. మౌనికనే లేపుకుపోయావేంటన్నా.. మనోజ్ పై సెటైర్లు..!
NQ Staff - March 4, 2023 / 09:41 AM IST

Manchu Manoj : మంచు మనోజ్-మౌనిక రెడ్డిల రెండో పెండ్లి శుక్రవారం రోజు అంగరంగ వైభవంగా జరిగింది. వీరిద్దరి పెండ్లి గురించి చాలా కాలంగా ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. కానీ వారిద్దరు మాత్రం స్పందించట్లేదు. గతంలో మంచు మనోజ్‌కు వేరే అమ్మాయితో పెండ్లి అయింది. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు.
అటు భూమా మౌనిక రెడ్డికి కూడా అంతకు ముందే వేరే వ్యక్తితో పెండ్లి అయింది. కానీ అతనితో విబేధాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. కాగా అప్పటి నుంచి మనోజ్, మౌనికల మధ్య ప్రేమ చిగురించింది. దాంతో వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. ఇక రీసెంట్ గా వీరిద్దరూ పెండ్లి చేసుకున్నారు.
మనోజ్ గెస్ట్ గా వెళ్లి..
అయితే ఈ పెండ్లి సందర్భంగా మనోజ్ మీద సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్, సెటైర్లు పేలుతున్నాయి. గతంలో మౌనిక రెడ్డి పెండ్లికి మనోజ్ గెస్ట్ గా వెళ్లిన ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ఫొటోలను చూసిన కొందరు.. పెండ్లికి అతిథిగా మనోజ్ ను పిలిస్తే.. ఏకంగా వారిద్దరినీ విడదీసి మౌనికనే లేపుకుపోయాడుగా అంటున్నారు.

Netizens Trolling Manchu Manoj
ఇంకొందరేమో.. అమ్మాయి బాగుందని మనోజ్ అన్న ఇలా సెట్ చేసుకున్నాడుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇదంతా ఫన్నీగానే జరుగుతోంది. ఇక కొత్త జంటకు చాలా మంది కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక వీరిద్దరి పెండ్లిని పెద్దలు మొదట ఒప్పుకోకపోయినా.. చివరకు అంగీకరించక తప్పలేదు.