Netizens trolling Anasuya Bharadwaj : ట్రోలర్స్ ను మళ్లీ గెలికిన అనసూయ.. నా పేరు తీయకుండా ఉండలేరా అంటూ..!

NQ Staff - July 15, 2023 / 11:05 AM IST

Netizens trolling Anasuya Bharadwaj : ట్రోలర్స్ ను మళ్లీ గెలికిన అనసూయ.. నా పేరు తీయకుండా ఉండలేరా అంటూ..!

Netizens trolling Anasuya Bharadwaj  :

అనసూయ యాంకర్ గా ఎంత ఫేమస్సో.. వివాదాలతో కూడా అంతే ఫేమస్ అయిపోయింది. ఆమె బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. అప్పటి వరకు ఉన్న రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేసేసి.. నా డ్రెస్ నా ఇష్టం అన్నట్టు కొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. అప్పటి నుంచి ఆమె కుర్రాళ్లకు హాట్ యాంకర్ అయిపోయింది.

ఇక బుల్లితెరపై టాప్ యాంకర్ గా ఎదిగిన అనసూయ .. కొన్ని వివాదాలతో మరింత ఫేమస్ అయింది. స్టార్ హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఆమె తరచూ విమర్శలు పాలు అయింది. ఇక ఆమె మీద వచ్చిన ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు.

ఎవరి జోలికి పోనంటూ..

కాగా రీసెంట్ గా విమానం ప్రమోషన్స్ లో ఇక నుంచి తాను వివాదాలకు పులిస్టాప్ పెడుతున్నట్టు తెలిపింది. తాను ఎవరి జోలికి పోనని.. ప్రశాంతంగా ఉంటానని చెప్పింది. అప్పటి నుంచి ఆమె మీద కాస్త విమర్శలు తగ్గాయి. కానీ ఇప్పుడు మరో సారి ట్రోలర్స్ ను గెలికింది. ఆమె ట్వీట్ లో అసహనం వ్యక్తం చేసింది.

నేను వాళ్లకు చాలా ముఖ్యం అనుకుంటా. నా పేరును తీయకుండా అస్సలు ఉండలేరు. నా పేరు ఎత్తకుండా ఒక్క డిస్కషన్ కూడా జరగదు. నాపైనే అందరూ ఆధారపడి ఉన్నారు అంటూ సెటైర్లు వేసింది. ఈ కామెంట్లు ఎవరిని ఉద్దేశించి చేసిందో ఎవరికీ అర్థం కావట్లేదు. కానీ ఆమె మరోసారి ట్రోలర్స్ కు అవకాశం ఇచ్చినట్టు అయింది ఈ ట్వీట్ తో. ప్రస్తుతం ఆమె అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us