Salman khan : సల్మాన్ ఖాన్‌ను రొటీన్ సినిమాలు తీయొద్దన్న నెటిజన్స్..

Salman khan : కండల వీరుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవలే రాధే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ప్రతి సంవత్సరం ఈద్ కానుకగా తన సినిమాల విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటుంటాడు. అయితే గత కొన్ని ఏళ్ళుగా ఈ కండల వీరుడు నుంచి ఈద్ కానుకగా వస్తున్న సినిమాలు పెద్దగా కలిసి రావడంలేదు. ఈసారి ఈద్ కి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ‘రాధే’ సినిమాతో వచ్చాడు.

netizens says salman-khan-not to do routine movies
netizens says salman-khan-not to do routine movies

ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితుల కారణంగా ‘పే ఫర్ వ్యూ’ పద్దతిలో ఈ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేశాడు. అయితే ‘రాధే’ సినిమా చూసిన ప్రేక్షకులు, విశ్లేషకులు ప్లాప్ సినిమా అని తేల్చేశారు. సల్లు భాయ్ ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశ చెందుతున్నారట. ఇందుకు ముఖ్య కారణం దర్శకుడు ప్రభుదేవా అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొరియన్ రీమేక్ అంటూ గత కొన్నేళ్ళుగా చూస్తున్న రొటీన్ మాస్ మసాలా సినిమానే మా హీరోతో చేసి ప్రభుదేవా ఫ్లాపిచ్చాడని ఫ్యాన్స్ ఏకేస్తున్నారట.

Salman khan : సల్మాన్ ఖాన్‌ రాధే చెత్త సినిమాగా ఇప్పుడు చెప్పుకుంటున్నారు.

కథ – కథనం మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపటికి సల్మాన్ ఎలివేషన్ మీదే ఫోకస్ పెట్టి సినిమాను పక్కదారి పట్టించాడని వాపోతున్నారట. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో దర్శకుడిగా మారిన కొరియోగ్రాఫర్ ప్రభుదేవా హిందీలో ‘ఆర్.రాజ్ కుమార్’, ‘యాక్షన్ జాక్షన్’, ‘సింగ్ ఈజ్ బ్లింగ్’, ‘దబాంగ్ 3’..లాంటి రొటీన్ మాస్ మసాలా సినిమాలు తీసి హీరోలకు ఫ్లాపులిచ్చాడు. ‘దబాంగ్ 3’ డిజాస్టర్ అయినా సల్మాన్ ‘రాధే’కి అవకాశం ఇచ్చాడంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని అందరూ ఫిక్సయ్యారు. అదే చెత్త రేటింగ్ వచ్చే సినిమాగా ఇప్పుడు చెప్పుకుంటున్నారు.