RRR: డిప్లొమాలో ఉన్నప్పుడు షూటింగ్ మొద‌లైంది.. ఇంకా విడుద‌ల కాలేదంటూ ఆర్ఆర్ఆర్‌పై సెటైర్

RRR: రాజ‌మౌళి సినిమాలు అంటే దాదాపు సంవ‌త్స‌రాలు త‌ర‌బ‌డి తెర‌కెక్కుతూ ఉంటాయి.బాహుబ‌లి కోసం దాదాపు ఐదేళ్లు స‌మ‌యం కేటాయించిన రాజ‌మౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మూడు సంవ‌త్స‌రాల‌లో తెర‌కెక్కించాడు. ఈ మూవీ అనౌన్స్ అయ్యి సరిగ్గా ఈ రోజుతో నాలుగేళ్లు కంప్లీట్ చేసుకుందంటూ ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ నిన్న‌ తెలిపింది. స‌రిగ్గా నాలుగేళ్ల కింద‌ట 2017లో రాజమౌళి ఈ పిక్ పెట్టి ఎన్నో ఊహాగానాలకు నాంది పలికారు.

netizens satries on rrr team1
netizens satries on rrr team1

మూవీ ప్రారంభమై మూడు ఏళ్ళు పూర్తి చేసుకుందని.. ఇప్పుడు 50 రోజుల్లో ఈ సినిమా మ్యూజిక్ ని రిలీజ్ చెయ్యడానికి రెడీ చేస్తున్నాం అని మూవీ యూనిట్ పోస్ట్ చేసింది. ఇక ఆర్ఆర్ఆర్ నిమాప్రపంచవ్యాప్తంగా దాదాపు 10000 స్క్రీన్లలో విడుదల అవుతుందని తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై నవంబర్ 19తో మూడేళ్లు అవుతుంది. సరిగ్గా నవంబర్ 18న 2018న రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేస్తూ షూటింగ్ స్టార్ట్ చేసినట్లుగా డీవీవీ నిర్మాణ సంస్థ ప్రకటించింది. తాజాగా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసిన ఓ నెటిజన్.. ఆర్ఆర్ఆర్ సినిమా పై వ్యంగ్యంగా స్పందించాడు. అప్పటి ట్వీట్ రీట్విట్ చేస్తూ. “డిప్లొమాలో ఉన్నప్పుడు మీరు సినిమా షూటింగ్ ప్రారంభించారు. బీటేక్ కూడా అయిపోయింది. సినిమా మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు” అంటూ అసహనం వ్యక్తం చేశాడు.

ఇది చూసిన చిత్రయూనిట్.. నెటిజన్ ట్వీట్ కు స్పందించింది. అతడి ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. ఏం చేద్దాం మరి.. నువ్వు కాలేజీకి వెళ్లనన్ని రోజులు మేము కూడా షూటింగ్ చేయలేదు అంటూ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యమైనట్లుగా చెప్పకనే చెప్పింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

netizens satries on rrr team2
netizens satries on rrr team2

ఈ మూవీలో ఎన్టీఆర్ , రామ్ చరణ్‌లు కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు పోషిస్తోన్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ మూవీని జనవరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది మూవీ యూనిట్.