ANASUYA: సెల‌బ్రిటీల‌పై నెటిజ‌న్స్ ఫైర్…ఇలాంటి స‌మ‌యంలో గ్లామ‌ర్ షోలు, విహార‌యాత్ర‌లు అవ‌స‌ర‌మా?

ANASUYA అభిమానులకు న‌చ్చితే నెత్తిన పెట్టుకుంటారు, తేడా వ‌స్తే వారిని ఏకి పాడేస్తారు. తాజాగా టాలీవుడ్, బాలీవుడ్ సెల‌బ్రిటీల‌పై నెటిజ‌న్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. వివ‌రాల‌లోకి వెళితే ప్ర‌స్తుతం క‌రోనా క‌ష్ట‌కాలం న‌డుస్తుంది. లాక్‌డౌన్ , క‌ర్ఫ్యూలు మ‌ళ్లీ పెట్ట‌డంతో జ‌నాలు తిండి దొర‌క్క ఇబ్బంది ప‌డుతున్నారు. కొంద‌రు ఆక‌లి చావులు చ‌స్తున్నారు. మరోవైపు ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా సకాలంలో ఆక్సిజన్ అందక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజల బాగోగులు ప‌ట్టించుకోని కొంద‌రు సెల‌బ్రిటీలు గ్లామ‌ర్ షో చేస్తూ ఫొటో షూట్స్ చేయ‌డం, ఆ ఫొటోల‌ను మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం వంటివి చేస్తున్నారు. ఇంకొంద‌రు అయితే విహార యాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేయడం.. బికినీ ఫోజులు పోస్ట్ చేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. బాధ్య‌త‌గా ఉండాల్సిన స‌మ‌యంలో ఇలా ప్ర‌వ‌ర్తిస్తారా అంటూ వారిపై ఆగ్ర‌హ జ్వాల‌లు మిన్నంటుతున్నాయి.

రీసెంట్‌గా అందాల భామ అన‌సూయ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో కుర‌చ దుస్తుల‌లో దిగిన ఫొటోల‌ను షేర్ చేసింది. వీటిని కొంద‌రు ఆస్వాదిస్తుంటే మ‌రి కొంద‌రు మాత్రం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఇలాంటి పొట్టి దుస్తులు ధరించి ర‌చ్చ చేయ‌డం అవ‌స‌ర‌మా అంటూ మండిప‌డ్డారు. అయితే దీని పై స్పందించిన అన‌సూయ ..మీకు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించేందుకే ఇలా చేస్తున్నాం, మీరు త‌ప్పుగా అర్దం చేసుకుంటున్నార‌ని పేర్కొంది. దీనికి బ‌దులిచ్చిన ఓ నెటిజ‌న్.. ఇలాంటి స‌మ‌యంలో కావ‌ల‌సింది స‌పోర్ట్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ కాదు అని అన్నారు. ఆయ‌న కామెంట్స్ కు ప‌లువురు మ‌ద్దతుగా నిలుస్తున్నారు.

క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ కూడా ఇలాంటి విష‌యాల‌పై మండిప‌డుతుంది. అందరూ విహారయాత్రలకు వెళ్లి హాలిడే ని ఆస్వాదించవచ్చు.. కానీ ఇలాంటి విపత్కర సమయంలో అది సమంజసం కాదని శృతి అభిప్రాయ పడుతోంది. ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను గుర్తించి వాళ్లు క‌ష్టాల‌లొ ఉన్న‌ప్పుడు హాలీడేస్ వెళ్ల‌డం క‌రెక్ట్ కాదు. ఇది చాలా క‌ఠిన స‌మ‌యం. ఒక‌రికొక‌రం అండ‌గా ఉండాలి అంటూ శృతి హాస‌న్ సున్నితంగా స్పందించింది. తన వంతుగా ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని షేర్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటానని శృతి ప్రకటించింది. ప్రముఖ రచయిత శోభా దే – బాలీవుడ్ ప్రచారకర్త రోహిణి అయ్యర్ వంటి వారు కూడా సెలబ్రిటీలు సైతం ఈ స‌మ‌యంలో హాలీడేస్‌కు వెళ్ల‌డం స‌రికాదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement