Surya: న‌టుడు సూర్య‌పై ఆగ్ర‌హం.. ఆయ‌న‌ను త‌న్నిన వారికి ల‌క్ష రూపాయ‌ల న‌జరానా

Surya: త‌మిళ హీరోల‌పై ఆగ్ర‌హం పెళ్లుబికుతుంది. వారిని త‌న్నిన వారికి న‌జరానాలు ప్ర‌క‌టిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఆ మధ్య కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి, ఆయన బృందం బెంగళూరు విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన్నడానికి ప్రయత్నించిన వీడియో ఈ వారంలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన సేతుపతి సమస్యను చిన్న గొడవగా కొట్టిపారేసాడు.

 

netizens fire on surya4
netizens fire on surya4

హిందూ మక్కల్ కట్చి అని పిలువబడే ఒక హిందూవాడ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1,001 బహుమతిని ప్రకటించడం సంచలనంగా మారింది. విజయ్ సేతుపతి స్వాతంత్ర్య సమరయోధుడు దైవతిరు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ అయ్యను, దేశాన్ని అవమానించాడని తెలుపుతూ వీడియో స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసింది. తేవర్ అయ్యను అవమానించినందుకు నటుడు విజయ్ సేతుపతిని తన్నిన వారికి హిందూ మక్కల్ కట్చి సంస్థకు చెందిన వ్యక్తి అర్జున్ సంపత్ నగదు బహుమతిని ప్రకటించారు.

తాజాగా సూర్యని త‌న్నిన వారికి ల‌క్ష రూపాయ‌ల బ‌హుమ‌తి అంటూ ప్ర‌క‌టించారు. త‌మిళ‌నాడు క‌డ‌లూర్‌లో జ‌రిగిన ఓ నిజ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను సూర్య, జ్యోతిక నిర్మించారు. ఈ సినిమా థియేట‌ర్స్‌లో కాకుండా ఓటీటీలోనే డైరెక్ట్‌గా రిలీజైంది. ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటున్న ఈ సినిమా విష‌యంలో సూర్య విమ‌ర్శ‌ల‌ను కూడా ఎదుర్కొవాల్సి వ‌స్తుంది.

కొన్ని రాజ‌కీయ పార్టీలు, స‌ద‌రు పార్టీల‌కు చెందిన నేత‌లు జై భీమ్ సినిమాలోని స‌న్నివేశాల‌ను త‌ప్పు ప‌డుతున్నారు. ఈ సినిమాలో ఓ స‌న్నివేశం ఉంటుంది. అందులో మ‌త‌ప‌ర‌మైన చిహ్నం ఉంటుంది. అందులో సూర్య న‌టించ‌డాన్ని పీఎంకే పార్టీకి చెందిన‌ మైలాడుతురై జిల్లా కార్య‌ద‌ర్శిప‌న్నీరు సెల్వం త‌ప్పుప‌ట్టారు. హీరో నిర్మాత సూర్య‌పై, ద‌ర్శ‌కుడిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సూప‌ర్‌డెంట్ ఆఫ్ పోలీస్‌ను క‌లిసి లేఖ‌ను స‌మ‌ర్పించారు.

netizens fire on surya1
netizens fire on surya1

వ‌న్నియార్ అనే సామాజిక వ‌ర్గాన్ని జై భీమ్ చిత్రంలో సూర్య అవ‌మానించార‌ని, ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పి న‌ష్ట ప‌రిహారం కింద ఐదు కోట్ల రూపాయ‌ల‌ను ఇవ్వాల‌ని వ‌న్నియార్ సంఘ ప్ర‌తినిధులు కోరుతూ నోటీసులు ఇచ్చారు. ఇదే క్ర‌మంలో సూర్య పై దాడి చేసిన వారికి ల‌క్ష రూపాయ‌ల‌ను ఇస్తామంటూ పీఎంకే పార్టీ నేత‌లు ప్ర‌క‌టించారు.