Shanmukh Jashwanth : అరే షన్నూ ఏంట్రా ఇది.. కొత్త గర్ల్ ఫ్రెండ్ తో కిస్ లు, హగ్గులు..!
NQ Staff - March 19, 2023 / 07:46 PM IST

Shanmukh Jashwanth : సోషల్ మీడియా స్టార్లలో అందరి కంటే ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది మాత్రం షణ్ముఖ్ జస్వంత్ కే అని చెప్పుకోవాలి. ఆయన ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఒక్క సీరియల్ లో కూడా నటించలేదు. కానీ ఆయనకు మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక గతంలో ఆయన దీప్తి సునయనతో లవ్ లో ఉన్న విషయం తెలిసిందే.
వీరిద్దరి జంటకు అప్పట్లో మంచి ఫాలోయింగ్ ఉండేది. ఇద్దరూ కలిసి చేసే పాటలకు మంచి క్రేజ్ ఉండేది. కానీ షణ్ముఖ్ బిగ్ బాస్ లో సిరి హన్మంతుతో చేసిన రొమాన్స్ కారణంగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. అప్పటి నుంచి ఎవరికి వారే ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటున్నారు. ఇక తాజాగా దీప్తి ఏమోనే సాంగ్ తో వస్తే.. షణ్ముఖ్ మాత్రం అయ్యయ్యో అనే సాంగ్ తో వచ్చాడు.
ఆమెతో క్లోజ్ గా..
అయితే ఈ నడుమ ఆయన నటి ఫణి పూజితతో కాస్త క్లోజ్ గా ఉంటున్నాడు. దాంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే షణ్ముఖ్ దీప్తి తర్వాత అంత సన్నిహితంగా ఈమెతో మాత్రమే ఉంటున్నాడు. ఇక తాజాగా అయ్యయో సాంగ్ కు సంబంధించిన గ్లింప్స్ ను పోస్టు చేశాడు షన్నూ.
ఇందులో కొత్త గర్ల్ ఫ్రెండ్ తో ఓ సీన్ లో ముద్దులు, హగ్గులు అంటూ బాగానే రెచ్చిపోయాడు. దాంతో అది చూసిన ఆయన ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. అరేయ్ షన్నూ ఏంట్రా ఇది.. దీప్తి చూస్తే బాగోదు. నీ లాగే దీప్తి కూడా వేరే వారితో ఇలా చేస్తే నీకు ఎలా ఉంటుంది అంటూ అడుగుతున్నారు. మరి షన్నూ ఈమెతో అయినా కలిసి ఉంటాడా లేదా చూడాలి.