Ashu Reddy : అషురెడ్డికి మందు బాటిల్ గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. ఇదేం విడ్డూరం అంటున్న నెటిజన్లు..!

NQ Staff - March 19, 2023 / 07:31 PM IST

Ashu Reddy : అషురెడ్డికి మందు బాటిల్ గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. ఇదేం విడ్డూరం అంటున్న నెటిజన్లు..!

Ashu Reddy : బిగ్ బాస్ భామ అషురెడ్డి ఈ నడుమ నిత్యం వార్తల్లో ఉంటుంది. అలాగని ఆమె పెద్దగా సినిమాలు, సీరియల్స్ చేయట్లేదు. అలాగని బుల్లితెరపై కూడా కనిపించట్లేదు. కానీ ఏదో ఒక పోస్టు చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది. బిగ్ బాస్ ఓటీటీ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు అస్సలు రావట్లేదు. అప్పటి నుంచి నిత్యం వెకేషన్లు ప్లాన్ చేస్తోంది.

దాంతో పాటు పలు వివాదాస్పద ఇంటర్వ్యూలు కూడా చేస్తోంది. మొన్న ఆర్జీవీతో కలిసి చేసిన ఇంటర్వ్యూ ఎంత దుమారం రేపిందో మనం చూశాం. అప్పటి నుంచి ఆమె కూడా ట్రోల్స్ కు బాగానే స్టఫ్ ఇస్తోంది. తాజాగా ఆమె ఓ పోస్టు చేసింది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అయిపోతున్నారు.

తల్లికి ఇష్టం లేదంట..

ఆమెకు తండ్రి ఓ ఖరీదైన గిఫ్టు పంపించాడు. అది కూడా మందు బాటిల్. అంటే అదేమైనా జ్వరం మందేమో అనుకునేరు. కాదండోయ్ నిఖార్సైన ఆల్కాహాల్ మందు బాటిల్. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. కూతురుకి డాడీ గిఫ్ట్ అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ గిఫ్టు తన తల్లికి ఇష్టం లేదని కూడా చెప్పింది.

ఇది చూసిన నెటిజన్లు షాక్ అయిపోతున్నారు. బాబోయ్ ఒక తండ్రి కూతురుకు ఇలాంటి గిఫ్టు ఇస్తాడా అని కామెంట్లు పెడుతున్నారు. ఆమె తండ్రి కూడా ఆమెలాగానే ఉన్నాడంటూ చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు అషురెడ్డి పెద్ద రచ్చ లేపిందని అంటున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us