Liger : లైగర్ డిజాస్టర్ కి మెగాస్టార్ కారణమా?
NQ Staff - August 27, 2022 / 10:13 AM IST

Liger : అదేంటి? విజయ్ హీరోగా వచ్చిన సినిమాకి చిరంజీవి చూయించిన ఎఫెక్ట్ ఏంటి అనంటే.. చిరు ఏ సినిమా ప్రమోషన్ కి అటెండయినా, ఏ ప్రీరిలీజ్ ఈవెంట్లో కనిపించినా, ఆ మూవీ అడ్రస్ లేకుండా పోతుందంటూ కొందరు సెటైర్స్ వేస్తున్నారు. ఆయనే స్వయంగా చేసిన సినిమా ఆచార్య నెగిటివ్ రిజల్ట్ కి ఇలాంటి కామెంట్స్ బోనస్. ఆ తర్వాత లాల్ సింగ్ ఛడ్డా తెలుగు సమర్పకుడిగా వచ్చిన ఫలితం ఇంకో అడిషన్. పక్కా కమర్షియల్, మిషన్ ఇంపాజిబుల్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు చిరు గెస్ట్ గా వెళ్లాడు. చెప్పాలంటే ఆ మూవీలకు ఆడియెన్స్ కనెక్ట్ అవ్వక డిజాస్టర్లయ్యాయి.
కానీ.. కామన్ గా ఉన్న పాయింట్ మెగాస్టార్ కావడంతో

Netizens Commenting Chiranjeevi Reason For Liger Flop
ఈ బ్యాడ్ రిజల్ట్స్ ఆయన ఖాతాలోకి వేశారు. మరి చిరు లైగర్ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయలేదు. సినిమాకీ ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేయలేదు. మరి ఆయనెందుకు రీజనయ్యాడు అంటే.. లైగర్ టీమ్ రిలీజ్ కు ముందు గాడ్ ఫాదర్ సెట్స్ కి వెళ్లారు. చిరు వాళ్లని కలిసి కాస్త టైమ్ స్పెండ్ చేసి ఆల్ ది బెస్ట్ అంటూ విష్ చేశాడు.
దాంతో చిరు ఐరన్ హ్యండే లైగర్ ఫ్లాపుకి కూడా కారణమంటూ తలాతోకలేని కామంట్స్ నెట్టింట్లో కనిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా చిరు మీద సోషల్మీడియాలో నెగిటివ్ గా పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఆచార్య డిజాస్టర్ తర్వాత ఆ ఫ్లో ఇంకా పెరిగింది. ఇక కొన్నాళ్లుగా ఆయన అటెండయిన
ఈవెంట్ల సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో ఇంకాస్త ట్రోలింగ్ పెరిగింది. ఒక సినిమాని సపోర్ట్ చేస్తూ, జనాల్లోకి ఇంకా వెళ్లాలన్న కాన్సెప్ట్ తో చిరంజీవి ఫంక్షన్స్ కి వస్తుంటారు. ఆయన వీలు చేసుకుని మరీ ఒచ్చినందుకు మూవీ మేకర్స్ అండ్ స్టార్స్ హ్యాపీగా ఫీలవుతారు. తమ ప్రాజెక్ట్ మరో మెట్టెక్కిందనుకుని మురిసిపోతారు. రిలీజ్ తర్వాత హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా అనేదానితో ఆయనకు సంబంధం ఉండదు కదా.
మరి అలాంటప్పుడు చిరు ఎఫెక్టే ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అంటూ సెన్స్ లెస్ కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్?

Netizens Commenting Chiranjeevi Reason For Liger Flop
అంటూ మెగా అభిమానులు ఫైరవుతున్నారు. ఇచ్చిన హైప్ కి, అభిమానులు పెంచుకున్న అంచనాలకి, చేసిన ప్రమోషన్స్ కి అవుట్ పుట్ ఏ మాత్రం మ్యాచ్ కాక రిలీజ్ చేసిన అన్ని భాషల్లోనూ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది లైగర్ కి. ఏ రకంగా కూడా చిరు చేసిందేమీ లేదు. చేసేదీ ఏమీ లేదు.
సో..మోకాలికి, బోడిగుండుకి లింక్ పెట్టినట్టు.. ఆయన సొంత ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటూనే పక్క సినిమాలకి కూడా సపోర్ట్ చేస్తున్న చిరంజీవిని, ఎక్కడో ఎవరో చేసిన చిత్రాల రిజల్ట్ ని కలిపి కామెంట్ చేసే ఇలాంటి సోషల్మీడియా ఇష్యూస్ ఏ మాత్రం మంచిది కాదనేది సినిమా ప్రేమికుల వాదన. ఇలాంటి సెన్సె లెస్ ట్రోల్స్ కి ఎప్పుడు తెరపడుతుందో ఏంటో?