Satya Dev : సత్యదేవ్ ‘కెసిపిడి’.! కొత్తగా ‘మెగా’ అర్థం చెబుతున్నారేంటీ.?
NQ Staff - October 5, 2022 / 10:06 PM IST

Satya Dev : నిన్నటిదాకా అదో పచ్చి బూతు.. కానీ, ఇప్పుడు దానికి కొత్త అర్థం వచ్చి పడింది.! ఏంటో, ఈ సినీ పైత్యం.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
సోషల్ మీడియా పుణ్యమా అని, కొన్ని పదాలకు షార్ట్ కట్స్ వాడేయడం చాలామందికి అలవాటైపోయింది. అలా ‘కెసిపిడి’ అంటూ పెద్ద సినిమాలు, పెద్ద హీరోల విషయంలో బూతుల్ని యధేచ్ఛగా సోషల్ మీడియాలో వాడేస్తున్నారు. ‘టెన్’ అనే మాటని ఎంత ఛండాలంగా వాడుతున్నారో చూస్తున్నాం.
కేసీపీడీ అంటే ఏంటి.?
సరే, ఆ పాత బూతు అర్థం సంగతి పక్కన పెట్టేద్దాం. దాని గురించి చర్చించుకోవడం అనవసరం. ఇప్పుడు కొత్త అర్థం వినిపిస్తోంది. ‘కొణిదెల చిరంజీవి ప్యూర్ డామినేషన్’ అనేది ‘కెసిపిడి’కి కొత్త అర్థంగా మారింది.
‘గాడ్‌ఫాదర్’ సినిమాలో విలన్‌గా నటించిన యువ నటుడు సత్యదేవ్, సోషల్ మీడియాలో ‘కెసిపిడి’ అని పేర్కొనగానే, విపరీతమైన ట్రోల్ తొలుత జరిగింది. ఆ వెంటనే, సీన్ మారింది. ‘కేసీపీడీ అర్థం మారింది. సత్యదేవ్ చెప్పింది వేరే..’ అంటూ మెగాభిమానులు సరికొత్తగా వివరిస్తున్నారు.
‘గాడ్ ఫాదర్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డామినేషన్ అన్ని విభాగాల్లోనూ కనిపించింది. అందుకే ‘కెసిపిడి.. కొణిదెల చిరంజీవి ప్యూర్ డామినేషన్’ అని అర్థం చేసుకోవాలన్నమాట.