Sai Pallavi : నిన్ను అభిమానించే వారి యొక్క బాధ కూడా నీకు పట్టదా వెన్నెల?
NQ Staff - September 19, 2022 / 03:49 PM IST

Sai Pallavi : ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి ఇప్పుడు అభిమానులను బాధ పెడుతోంది. తెలుగులో వరుసగా సినిమాలు చేసి వరుసగా సక్సెస్ కాకున్నా ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాలను చేరువైన విషయం తెలిసిందే.
మా అమ్మాయి, పక్కింటి అమ్మాయి,
మనలో అమ్మాయి అన్నట్లుగా సాయి పల్లవి అందరూ చూశారు. తాజాగా వచ్చిన విరాటపర్వం సినిమాలో కూడా వెన్నెల పాత్రను అంతగా ఆదరించారు అనే విషయం అందరికీ తెలిసిందే.
అందుకే ఆమెకు ఫిలిం మేకర్స్ మూడు నాలుగు కోట్ల పారితోషికం ఇచ్చి కూడా తమ సినిమాల్లో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆమె మాత్రం ఇప్పటి వరకు తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన ఇవ్వడం లేదు.
ఇటీవల ఒక లేడీ ఓరియంటెడ్ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా సాయి పల్లవికి ఆఫర్లు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.

Netizens Are Trolling Sai Pallavi
కానీ ఈ అమ్మడు మాత్రం ఇప్పటి వరకు కొత్త సినిమా సైన్ చేయక పోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకు సినిమాలు ఇంట్రెస్ట్ లేకపోతే మొదటనే రాకుండా ఉండాల్సింది.. ఇప్పుడు కొన్ని సినిమాలు చేసి అభిమానుల అభిమానం సొంతం చేసుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీ ఆసక్తి లేదు సినిమాలు చేయమంటే అభిమానులు ఏమైపోవాలి అంటున్నారు.
ఇప్పుడు అభిమానుల కోసమైనా నువ్వు సినిమాలు చేయాల్సిందే అంటూ కొందరు సోషల్ మీడియాలో సాయి పల్లవి అనే ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారు. అతి త్వరలోనే సాయి పల్లవి మళ్లీ బిజీగా తెలుగు మరియు తమిళ్ కమర్షియల్ సినిమాలు చేస్తుందని అభిమానులు కోరుకుంటున్నారు.
మరి సాయి పల్లవి అందుకు సిద్ధంగా ఉందా అనేది చూడాలి. వెబ్ సిరీస్ మరియు సినిమాలు ఇలా పద్దుల సంఖ్యలో ఆమె ఓకే చెప్తే రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆమె మాత్రం ఓకే చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. ముందు ముందు అయినా ఆమె నిర్ణయం మారుతుందా అని చూడాలి.