Rashmika Mandanna : విజయ్ తో నేను టూర్లకు వెళ్లా.. అయితే తప్పేంటి.. రష్మిక సీరియస్..!
NQ Staff - January 20, 2023 / 10:05 AM IST

Rashmika Mandanna : గత కొంత కాలంగా రష్మిక, విజయ్ దేవరకొండలకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుందో చూస్తున్నాం. వీరిద్దరిపై మొదటి నుంచి ఎన్నో రూమర్లు వస్తున్నాయి. కాగా న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరూ కలిసి మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లారంటూ పెద్ద ఎత్తున న్యూస్ వైరల్ అయింది. ఇద్దరూ ఒకే చోట వేర్వేరుగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అనుమానాలు పెరిగాయి.
ఇక అక్కడ రష్మిక తన ఫ్యాన్స్ తో లైవ్ లో చిట్ చాట్ చేస్తుండగా మధ్యలో విజయ్ దేవరకొండ వాయిస్ కూడా వినిపించింది. దాంతో ఈ అనుమానాలకు మరింత బలం పెరిగింది. అంతకు ముందు కూడా వీరిద్దరూ వెకేషన్‌కు వెళ్లారు. అప్పుడు వేర్వేరుగా ముంబై ఎయిర్ పోర్టులో కనిపించారు.
తాజా ఇంటర్వ్యూలో..
అప్పటి నుంచే వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్లు బాగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే రష్మిక ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. తాను విజయ్ దేవరకొండతో వెకేషన్లకు వెళ్లలేదని చెప్పనని.. కాకపోతే తామిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని తెలిపింది.
మొత్తానికి ఆమె వెకేషన్లకు వెళ్లింది వాస్తవమే అని తెలిపిందన్న మాట. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత బరితెగింపు అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు అయితే అన్ని పనులు అయిపోయాయి అంటూ వల్గర్ కామెంట్లు పెడుతున్నారు.