Balakrishna : పరువు పోగొట్టుకుంటున్న బాలయ్య.. ఇక మారవా..?

NQ Staff - October 10, 2023 / 09:28 AM IST

Balakrishna : పరువు పోగొట్టుకుంటున్న బాలయ్య.. ఇక మారవా..?

Balakrishna :

బాలయ్య పదే పదే కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఉంటారు. అదే సంస్కారం, పద్ధతి అనే పెద్ద పెద్ద వ్యాఖ్యలు. ఇప్పటికే బాలయ్య చేసిన వ్యాఖ్యలు గతంలో అనేక సార్లు దుమారం రేపాయి. కానీ ఆయన మాత్రం పైకి ఇవే బిల్డప్ లు ఇస్తుంటారు. కానీ ఆయన మాత్రం పాటించరు. ఇప్పుడు మరోసారి ఇలాంటి సంజ్జలు చేసి తన పరువు మొత్తం తానే తీసుకుంటున్నారు. పూరీ జగన్నాథ్ తో కలిసి బాలయ్య గతంలో ఓ సినిమా చేశారు. ఆ సినిమాలో బాలయ్యతో ఓ బూతు సంజ్ఞ చేయించారు పూరీ జగన్నాథ్. అయితే బయట కూడా బాలయ్యకు అలాగే అలవాటు అయిందని చెప్పుకోవాలి.

ఆ సినిమా ఎలాగూ పోయింది. కానీ బయట మాత్రం బాలయ్య దాన్ని వాడేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ సమయం, సందర్భం లేకుండా అసభ్యకరమైన హస్త లాఘవాన్ని చూపిస్తున్నారు. ఏకంగా మొన్న అసెంబ్లీలో కూడా అదే సంజ్ఞను చేసి చూపించారు. ఇది చూసే వారికి కూడా చాలా అసహ్యంగా అనిపించిందనే చెప్పుకోవాలి. అయితే తాజాగా ఆయన భగవంత్ కేసరి ట్రైలర్ ఈవెంట్ లో కూడా తన కొడుకు మోక్షజ్ఞ తనను ఏదో అన్నాడని చెప్పి చివరకు కొడుకు పరువు కూడా తీసేశాడు. ఆ సమయంలో తన చేతి సంజ్ఞను మరోసారి చూపించాడు.

అప్పట్లో ఇలాంటి చేతివాటం చూపించిన ప్రతి సినిమా ఫెయిల్ అయింది. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాలో కూడా ఇలాంటిది ఎక్కువగా చూపిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా కూడా గోవిందా అవుతుందేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు నందమూరి అభిమానులు. ఇంకో విషయం ఏంటంటే.. బాలయ్య ప్రతిసారి ఇలాంటి చేతి సంజ్ఞ చూపించడం ఆయన స్థాయిని తగ్గిస్తోందనే చెప్పుకోవాలి. ఒక పెద్ద హీరో, ఎమ్మెల్యే అయ్యి ఉండి ఇలాంటి నీచమైన సైగ చేయడం ఏంటని మండిపడుతున్నారు నెటిజన్లు. ఇలాంటి వ్యక్తి మళ్లీ పద్ధతి, సంస్కారం గురించి మాట్లాడటమా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Netizens Are Trolling Balakrishna

Netizens Are Trolling Balakrishna

బాలయ్య ఎప్పటికప్పుడు తనలోని కర్కశత్వాన్ని బయట పెట్టుకుంటూనే ఉన్నారు. అది చేతి సంజ్ఞ అయితేనేమి.. ఆడవారు కనిపిస్తే కడుపు చేయాలనే కామెంట్ అయితేనేమీ.. అభిమానులను ఫోన్ లో తిట్డడం అయితేనేమీ.. అభిమానులను తన్నడం అయితేనేమీ ఇలాంటివి చాలానే ఉన్నాయి.

ఇలాంటివి ఎప్పటికప్పుడు బాలయ్య నిజస్వరూపాన్ని బయట పెడుతూనే ఉన్నాయి. ప్రతిసారి ఆయన పరువు పోతూనే ఉంది. కానీ ఆయన్ను మాత్రం విమర్శించడానికి అందరూ భయడపతున్నారు. అదే చిరంజీవి అయితే ఈ పాటికి ఆయన మీద ఎన్ని విమర్శలు, ట్రోల్స్ చేసేవారో ఊహించుకుంటేనే మెగా ఫ్యాన్స్ కు భయమేస్తుంది.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us