Rashmika Mandanna: ఇండస్ట్రీ నుండి వెళ్లి పోవాలి అన్నంత బాధగా ఉందట
NQ Staff - January 25, 2023 / 06:07 PM IST

Rashmika Mandanna : గీత గోవిందం, చలో, డియర్ కామ్రేడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించిన రష్మిక మందన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం అల్లు అర్జున్ కి జోడిగా పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇటీవలే ఈ అమ్మడు సినిమాలతో కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలతో మరియు విమర్శలతో వార్తల్లో నిలుస్తోంది. గత కొన్ని రోజులుగా రష్మిక మందన్న ఏం చేసినా కూడా కొందరు కావాలని టార్గెట్ చేస్తున్నారట.
ఆమెను మాత్రమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులను కూడా వివాదంలోకి లాగే విమర్శలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమయంలో తాను మాట్లాడిన మాట్లాడకుండా ఉన్నా ఏం చేసినా కూడా తప్పే అన్నట్లుగా ఉంది అంటూ ఆమె సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది.
ఒకానొక సమయంలో ఇండస్ట్రీ నుండి వెళ్లి పోవాలి అన్నంతగా ఆగ్రహం నాకు కలిగింది అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రష్మిక మందన్న అసహనం వ్యక్తం చేసింది. అభిమానులు మాత్రం రష్మిక కు మద్దతుగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ కి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదంటూ ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు.