Jimmy Kimmel : నాటునాటు సాంగ్ ను అవమానించిన ఆస్కార్ ఈవెంట్ హోస్ట్.. భగ్గుమంటున్న ఫ్యాన్స్..!
NQ Staff - March 14, 2023 / 10:53 AM IST

Jimmy Kimmel : మన తెలుగు సినిమాకు మొదటి సారి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇప్పటి వరకు ఎంతో ఎదురు చూసిన ఈ అవార్డును రాజమౌళి తెచ్చి చూపించారు. ఆయన కార్యదక్షతతో ఇది సాధ్యం అయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మొదటి నుంచి త్రిబుల్ ఆర్ మూవీని బాలీవుడ్ మూవీ అంటూ చెబుతున్నారు కొందరు హాలీవుడ్ స్టార్లు.
అప్పటి నుంచి రాజమౌళి కూడా క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. త్రిబుల్ ఆర్ మూవీ బాలీవుడ్ మూవీ కాదు.. ఇండియన్ మూవీ అంటూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆస్కార్ ఈవెంట్ వేదికపై కూడా మరోసారి బాలీవుడ్ ప్రస్తావన వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాని బాలీవుడ్ ఫిల్మ్ అంటూ ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవంలో పిలిచారు అవార్డు హోస్ట్ జిమ్మీ కిమ్మెల్.
ఖండిస్తున్న నెటిజన్లు..
దాంతో త్రిబుల్ ఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆస్కార్ వేదికపై జరిగిన ఈ పొరపాటును అంతా ఖండిస్తున్నారు. త్రిబుల్ ఆర్ మూవీ బాలీవుడ్ మూవీ కాదని.. ఇండియన్ సినిమా, తెలుగు సినిమా అంటూ చెబుతున్నారు. జిమ్మీ కిమ్మెల్ చేసిన కామెంట్లపై విరుచుకు పడుతున్నారు నెటిజన్లు.
డియర్ ఆస్కార్స్ 95 టీమ్.. ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ మూవీ కాదు. ఇండియన్ మూవీ.. తెలుగు సినిమా దయచేసి గమనించండి అంటూ చెబుతున్నారు. ఇంకొందరు మాత్రం జిమ్మీ కిమ్మెల్ ను ట్యాగ్ చేస్తూ.. ఇది బాలీవుడ్ మూవీ కాదు.. తెలుగు సినిమా దయచేసి గమనించండి అంటూ చెబుతున్నారు.