RamGopal Varma : ఆర్జీవీ మార్కు పైత్యం: కృష్ణ చనిపోయారని బాధపడక్కర్లేదట.!

NQ Staff - November 15, 2022 / 07:00 PM IST

RamGopal Varma : ఆర్జీవీ మార్కు పైత్యం: కృష్ణ చనిపోయారని బాధపడక్కర్లేదట.!

RamGopal Varma : నలుగురికీ నచ్చినది.. నాకసలే నచ్చదులే.. అంటాడో సినిమాలో హీరో.! రామ్ గోపాల్ వర్మ కూడా అంతే. అందరికీ నచ్చేది ఆయనకు నచ్చదు. పదిమంది ఏడుస్తోంటే, అందులో ఆనందాన్ని చూస్తుంటాడాయన.!

ప్రముఖ సినీ నటుడు కృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే, కృష్ణ చనిపోయారని బాధపడాల్సిన అవసరం లేదట. స్వర్గంలో విజయనిర్మలతో కలిసి కృష్ణ ఎంజాయ్ చేస్తుంటారట. పాటలు పాడుకుంటూ, డాన్సులు చేసుకుంటూ వుంటారట కృష్ణ, విజయ నిర్మల.

కోరినది.. నెరవేరినది..!

ఈ మేరకు సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ ఓ పోస్ట్ పెట్టాడు. దానికి ఓ వీడియో కూడా జత చేశాడు. ‘మోసగాళ్ళకు మోసగాడు’ సినిమాలోని ‘కోరినది.. నెరవేరినది..’ అంటూ సాగే పాట తాలూకు వీడియో అది.

విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్య ఇందిర ఇటీవలే కన్నుమూశారు. విజయనిర్మల కొంత కాలం క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే.

కృష్ణ అభిమానులు తమ అభిమాన నటుడు ఇకలేరన్న ఆవేదనతో శోకసంద్రంలో మునిగిపోయి వుంటే, ఆర్జీవీ మాత్రం.. ‘బాధపడాల్సిన పనిలేదు.’ అంటూ ట్వీటేయడం పెద్దగా ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు.

ఎందుకంటే, ఆర్జీవీ అంతే.. ఆయన పైత్యమూ అంతే.! ‘నువ్వూ వెళ్ళి, వాళ్ళకి స్వర్గంలో టీ, కాఫీలు అందించక పోయావా.?’ అంటూ కొందరు నెటిజన్లు ఆర్జీవీ ట్వీటుపై మండిపడుతున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us