Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
NQ Staff - May 2, 2023 / 07:40 PM IST

Sudigali Sudheer : బుల్లితెర సూపర్ స్టార్ అంటూ పేరు దక్కించుకున్న సుడిగాలి సుధీర్ అనూహ్యంగా ఈటీవీ నుండి దూరం అయ్యి బుల్లితెర ప్రేక్షకులకు దూరం అయ్యాడు. స్టార్ మా టీవీలో ఏదో గొప్ప కార్యక్రమం చేస్తాను అంటూ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసి శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి మంచి కార్యక్రమాన్ని వదిలేసి ఇప్పుడు గాలికి తిరుగు తున్నాడు.
సినిమాల్లో హీరోగా ఆ మధ్య రెండు మూడు ఛాన్సులు వచ్చాయి. కానీ ఇప్పుడు పెద్దగా రావడం లేదు అంటూ ఆయన సన్నిహితులు స్వయంగా చెబుతున్నారు. హీరోగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ వచ్చాయి.. దాంతో అవకాశాలు రాక పోవడంతో దిక్కులు చూస్తున్నాడట.
కనీసం కమెడియన్ పాత్రలో నటించేందుకు కూడా అవకాశాలు రావడం లేదని సన్నిహితుల వద్ద వాపోతున్నాడట. గతంలో జబర్దస్త్ నుండి వెళ్లి పోయిన కమెడియన్స్ పరిస్థితి లాగే ఇప్పుడు సుడిగాలి సుధీర్ కి అయిందని కొందరు కామెంట్ చేస్తున్నారు.
కల్పవృక్షం వంటి జబర్దస్త్ కార్యక్రమాన్ని, మల్లెమాలను ఈటీవీని వదిలేసినందుకు సుడిగాలి సుదీర్ పెద్ద శిక్షనే ఎదుర్కొంటున్నాడు అంటూ స్వయంగా ఆయన అభిమానులే కామెంట్ చేస్తున్నారు.
ఒకప్పుడు సుడిగాలి సుదీర్ ను అభిమానిస్తూ సోషల్ మీడియా ద్వారా ఆర్మీగా ఏర్పడి ప్రశంసించిన వారే ఇప్పుడు ఆయన్ను విమర్శిస్తున్నారు. సినిమాలేమీ చేయక పోవడంతో తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.