Lavanya Tripathi : నాకు కుల పిచ్చి లేదు.. అందుకే వరుణ్ ను చేసుకున్నా.. లావణ్య క్లారిటీ..!
NQ Staff - June 13, 2023 / 11:07 AM IST

Lavanya Tripathi : గత కొన్ని రోజులుగా లావణ్య త్రిపాఠి గురించి గూగుల్ లో చాలా వెతుకుతున్నారంట. ఎందుకంటే ఆమె ఇప్పుడు మెగా ఫ్యామిలీకి కాబోయే కోడలు. దీంతో అసలు వీరిద్దరూ ఎక్కడ మొదట కలుసుకున్నారు, వారిద్దరూ ఎక్కడ ప్రపోజ్ చేసుకున్నారు, వారి పెళ్లి ఎక్కడ చేసుకుంటారు అని ఇలా చాలా రకాల విషయాలను ఆరా తీస్తున్నారు.
ఇదే సమయంలో కొందరు లావణ్య త్రిపాఠి వ్యక్తిగత విషయాలను కూడా ఆరా తీస్తున్నారు. ఆమె ఎక్కడ పుట్టింది, ఆస్తులు ఎంత అని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం లావణ్య త్రిపాఠి కులం ఏంటని వెతుకుతున్నారు. వరుణ్ ది కాపు కులం కాబట్టి.. లావణ్యది ఏ కులం అని అంతా ఆరాలు తీస్తున్నారు.
ఇలా వెతుకున్న సమయంలో మరికొందరు గతంలో లావణ్య తన కులంపై చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇందులో ఆమె నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను అని తెలిపింది. తనకు కులం పిచ్చి లేదని.. మనిషి చేసే పని వల్ల అతనికి గౌరవం దక్కుతుంది తప్ప కులాన్ని చూసి కాదని తెలిపింది.

Netizens Are Commenting On Lavanya Tripathi Caste
ఆమె చేసిన కామెంట్లను బట్టి చూస్తుంటే తనకు కులం పట్టింపు లేదని అర్థం అవుతుంది. ఏ కులం అయినా సరే తన మనసుకు నచ్చితే చేసుకుంటుంది. అలా ఆమెకు నచ్చాడు కాబట్టే వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందని అంటున్నారు నెటిజన్లు. ఎంతైనా లావణ్య మనస్తత్వం చాలా గొప్పది అంటున్నారు మెగా ఫ్యాన్స్.