Tejaswi: ఐస్‌క్రీం పాపపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజన్స్

Tejaswi: తేజస్వి మదివాడ.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా సుపరిచితం. 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంద్వారా తెలుగు తెరకు పరిచయమైన తేజస్వికి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీం చిత్రంతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చింది.చిన్నతనంలోనే కూచిపూడి నేర్చుకున్న తేజస్వి క్రమంగా పాశ్చాత్య నృత్యరీతులపైనా దృష్టిపెట్టింది. హెచ్‌.ఎస్‌.బీ.సీ., మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థల్లో డాన్స్‌ తరగతులు నిర్వహించింది. సినిమాల్లోకి రాకముందు ఓ డ్యాన్స్‌ ఇనిస్టిట్యూట్‌లో పార్ట్‌టైం డ్యాన్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా చేసింది. అల్లు అర్జున్‌తో క‌లిసి 7 అప్ ప్ర‌క‌ట‌న కూడా చేసింది. మిస్‌ హైదరాబాద్ గాను ఎంపికయింది.

Tejaswi Madivada

న‌టిగా కాస్త ఆఫ‌ర్స్ త‌గ్గిన స‌మ‌యంలో తేజ‌స్వికు బిగ్ బాస్ ఆఫ‌ర్ వ‌చ్చింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఇంట్లోకి అడుగుపెట్టిన ఈ ఐస్‌క్రీం పాప హౌజ్‌లో అంద‌రితో గొడ‌వ‌లు ప‌డుతూ ఉండేది. ఆడియ‌న్స్ స‌హ‌నాన్ని ప‌రీక్షించింది. ముందు ఫైన‌ల్ వ‌ర‌కు హౌజ్‌లో ఉంటుంద‌ని అంద‌రు భావించ‌గా, ఆమె ప్ర‌వ‌ర్త‌న‌తో విసిగిపోయిన ప్రేక్ష‌కులు త్వ‌ర‌గానే హౌజ్ నుండి పంపారు. హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక తేజ‌స్వికి ప‌లు ఆఫ‌ర్స్ వ‌చ్చిన‌ప్ప‌టికీ వాటిని స‌రిగ్గా సద్వినియోగం చేసుకోలేక‌పోయింది. ప్ర‌స్తుతం షోలు, సినిమాల ఆఫ‌ర్స్ ఏమి లేక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియా ద్వారా ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. అప్పుడ‌ప్పుడు తేజ‌స్వి పెట్టే పోస్ట్‌లు హెడ్ లైన్స్‌లో నిలుస్తుంటాయి.

Tejaswi Madivada

తాజాగా తేజ‌స్వి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటో షేర్ చేసుకోగా అది చూసిన నెటిజనులు తనపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ పార్క్ లో బుద్ధుడి విగ్రహం కనిపించేటట్లు ఫోటో తీయించుకోగా తను కూడా ఒక బండరాయిపై బుద్ధిడి లా యోగా చేస్తున్నట్లు ఫోటోకు ఫోజ్ ఇచ్చింది. అయితే ఈ ఫొటోలో కాళ్ల‌కు చెప్పులు వేస‌కొని యోగా చేస్తున్న‌ట్టుగా ఉంది. బుద్దుడి ప‌క్క‌న అలా కూర్చోవ‌చ్చా అంటూ నెటిజ‌న్స్ ఆమెపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి దీనిపై తేజ‌స్వి ఎలా స్పందిస్తుందో చూడాలి.