PAAGAL: ఇలియానాపై మ‌న‌సు పారేసుకున్న టాలీవుడ్ హీరో..నిద్ర లేని రాత్రులు కూడా గ‌డిపాడ‌ట‌

టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. ఫ‌ల‌క్‌నుమా దాస్ చిత్రంతో ద‌గ్గ‌రైన ఈ యువ హీరో ఇటీవ‌ల నాని నిర్మాణంలో రూపొందిన హిట్ చిత్రంతో ప‌ల‌క‌రించాడు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో పాటు విశ్వ‌క్‌కు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ప్ర‌స్తుతం పాగ‌ల్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమను ఏప్రిల్‌లో విడుద‌ల చేయాల‌ని భావించిన‌ప్ప‌టికీ, క‌రోనా వ‌ల‌న వాయిదా వేయ‌క త‌ప్ప‌లేదు. ఇక ఇప్పుడు షూటింగ్స్ కూడా చేసే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో మ‌నోడు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యాడు. ఖాళీ స‌మయంలో అభిమానుల‌తో చిట్ చాట్ చేస్తున్నాడు.

తాజాగా విశ్వ‌క్ సేన్ త‌న అభిమానుల‌తో లైవ్ చాట్ చేశాడు. ఈ చాట్ లో వారు అడిగే ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇచ్చి అంద‌ర‌ని స్ట‌న్ చేశాడు. చిన్న‌ప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఇంట్రెస్టింగ్ విష‌యాలు చెప్పుకొచ్చాడు. ప‌నిలో పనిగా త‌న ఫ‌స్ట్ క్ర‌ష్ గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఇలియానా అంటే త‌నకు ప్రాణ‌మ‌ని ఇప్ప‌టికీ ఆమె కోసం నిద్ర‌లేని రాత్రుళ్లు గడుపుతాన‌ని అన్నాడు. అలానే త‌న ఇంటి టెర్ర‌స్ ఫేవ‌రేట్ అని చెప్పుకొచ్చిన విశ్వక్ పెళ్లి సంబంధాలు చూడ‌మ‌ని అభిమానుల‌కు స‌ల‌హా ఇచ్చాడు. ఇక ఓ నెటిజ‌న్ మీ ఫోన్ నెంబ‌ర్ ఇవ్వొచ్చుగా అని అడ‌గ‌గా,దానికి ప్యాంటా, ష‌ర్టా? గిఫ్ట్ ఎప్పుడు ఇస్తున్నావు అని స‌మాధానం ఇచ్చాడు.

ఇక ఓ అభిమాని నా మ‌న‌సులో ఉంటున్నందుకు 10 వేల రూపాయ‌లు పంపించు అని అడిగాడు. ఇంకొక‌డు నాకు రిప్లై ఇవ్వ‌క‌పోతే సూసైడ్ చేసుకుంటా.. నీ మీద ఒట్టు అని బెదిరించాడు. అత‌నికి పూర్తి ధైర్యం అందించిన విశ్వక్ అడ్ర‌స్ కూపీ కూడా లాగి మీ గుండెల్లో ఎప్పుడు ఉంటా అని అన్నాడు. ఇక క‌పేలా రీమేక్ చేయ‌డం లేద‌ని, ఓ మై క‌డ‌వులే రీమేక్‌లో న‌టిస్తున్నానని, దీనికి సంబంధించిన 30 శాతం షూటింగ్ కూడా పూర్తైంద‌ని స్ప‌ష్టం చేశాడు. బిర్యానీ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చిన విశ్వక్ సేన్ త్వ‌ర‌లో పాగ‌ల్‌తో మనంద‌రికి మంచి వినోదాన్ని అందించ‌బోతున్నాడు.

Advertisement