Rana Naidu : రానా నాయుడు బూతుల ఎఫెక్ట్…వెంకటేష్, రానాలకు నెట్ ఫ్లిక్స్ షాక్..!
NQ Staff - March 30, 2023 / 04:33 PM IST

Rana Naidu : నెట్ ఫ్లిక్స్ లో ఈ నడుమ బూతుల సిరీస్ లు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అడల్ట్ కంటెంట్ ఉన్న సిరీస్ లు దారుణంగా పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా వచ్చిన రానా నాయుడు అయితే మరీ ఘోరంగా ఉంది. ఇందులో కంటెంట్ కంటే కూడా అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంది.
బూతులు అయితే ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పక్కర్లేదు. దాంతో ఈ సిరీస్ లో నటించిన వెంకటేష్, రానాల మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక నెట్ ఫ్లిక్స్ మీద కూడా దారుణంగా కామెంట్లు పెరుగుతున్నాయి. వెంకటేష్ లాంటి సీనియర్ క్లీన్ ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి బూతులు మాట్లాడటం ఏంటని అంతా షాక్ అవుతున్నారు.
అయితే తాజాగా ఈ బూతు పురాణాల ఎఫెక్ట్ తో నెట్ ఫ్లిక్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు రానా నాయుడు సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది. కానీ తాజాగా తెలుగు ఆడియోను తొలగిస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ స్పష్టం చేసింది. బూతులు చాలా ఎక్కువగా ఉండటంతోనే ఇలా చేసినట్టు తెలుస్తోంది.
ఈ సిరీస్ లో ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో నటించేందుకు వెంకటేశ్ రూ.12 కోట్లు తీసుకున్నాడు. రానా రూ.8 కోట్లు తీసుకున్నాడు.