Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Review : నేను మీకు బాగా కావాల్సినవాడిని రివ్యూ: అబ్బే, అలాంటోడు కాదు.!

NQ Staff - September 16, 2022 / 02:14 PM IST

Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Review  : నేను మీకు బాగా కావాల్సినవాడిని రివ్యూ: అబ్బే, అలాంటోడు కాదు.!

Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Review  : అనూహ్యంగా స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. చిన్న సినిమాలకు పెద్ద హీరో.. అనే ట్యాగ్ తగిలించుకున్న కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. శ్రీధర్ గాదె దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కథా కమామిషు ఏంటో తెలుసుకుందామా..

కథ: 

వివేక్ ఓ క్యాబ్ డ్రైవర్. తేజు అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగినితో ప్రేమలో పడతాడు. ఆమెకు ఓ ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. ఆ సంగతి పక్కన పెడితే, ప్రేమలో పడ్డ ఆ ఇద్దరి మధ్యా ఎలాంటి బంధం ఏర్పడుతుంది.? ఆ ప్రేమకథలో ట్విస్ట్ ఏంటి.? ఇద్దరి ప్రేమ కథ కంచికి చేరిందా.? లేదా.? ఆ ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

నటీనటుల పని తీరు..

Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Review

Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Review

కిరణ్ అబ్బవరం తీరులో కొత్తగా తేడా ఏం లేదు. గత సినిమాల్లో ఏం చేశాడో, ఇందులోనూ అదే చేశాడు. కొన్ని సన్నివేశాల్లో స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. అంతకు మించి, ప్రత్యేకంగా మాట్లడుకునేదేమీ లేదనిపిస్తుంది.

హీరోయిన్ సంజన ఆనంద్ ఒకింత నటనకు ప్రాధాన్యమున్న పాత్రలోనే కనిపించింది. వున్నంతలో బాగానే చేసింది. కాస్త పేరున్న నటి అయితే, ఈ పాత్రకు ఇంకా బావుండేదనిపిస్తుంది.

Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Review

Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Review

ఎస్వీ కృష్ణారెడ్డి బాగా చేశారు. నటుడిగా కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ ఓకే అనిపిస్తాడు. సమీర్ తదితరులు తమ పాత్రల పరిధి మేర మమ అనిపించేశారు.

ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఫర్వాలేదు. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య నిర్మాతగా ఎక్కడా రాజీ పడలేదు. సినిమాటోగ్రఫీ బావుంది.

ప్లస్ పాయింట్స్

Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Review

Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Review

కొన్ని చోట్ల హీరో ప్రదర్శించిన ఈజ్
హీరోయిన్ సంజన ఆనంద్
కొన్ని ఫ్యామిలీ ఎమోషన్లు

మైనస్ పాయింట్స్..

పరమ రొటీన్‌గా సాగే నెరేషన్
అరిగిపోయిన కథ

విశ్లేషణ..

యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా గురించి ప్రచారం జరిగింది. కిరణ్ అబ్బవరం సినిమాకి ఎక్కువగా ఎట్రాక్ట్ అయ్యేది యూత్. ఆ యూత్‌ని ఆకట్టుకోవడానికి ఇంకాస్త రేసీ స్క్రీన్‌ప్లేతో కూడిన యూత్ ఫుల్ సన్నివేశాలుండాలి. కానీ, పరమ రొటీన్ సన్నివేశాలు, కథనంతో బోర్ కొట్టించేస్తాడు దర్శకుడు. క్లయిమాక్స్‌కి ముందు వచ్చే ట్విస్ట్ ఒకటి కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. హీరో ఎనర్జీని, హీరోయిన్ నేచురల్ గ్లామర్‌నీ ఇంకాస్త బాగా వాడుకుని వుంటే బావుండేదేమో.

ఓవరాల్‌గా చూస్తే, సినిమా టైటిల్‌లో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అని వున్నా, ‘అబ్బే, అస్సలు కావాల్సినోడు కాదు’ అన్నట్లుగా సినిమా తెరకెక్కించినట్లనిపిస్తుంది.

                                                                                   రేటింగ్‌ః 2.0/5.0

Read Today's Latest సినిమా రివ్యూలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us