Kirak RP : కిరాక్ ఆర్పీ చేపల పులుసు నిజంగానే అంత బావుందా.?
NQ Staff - December 22, 2022 / 01:11 PM IST

Kirak RP : జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ, జబర్దస్త్ మానేసి చాన్నాళ్ళే అయ్యింది. చాలాకాలంగా కిరాక్ ఆర్పీ పేరు పెద్దగా ఎక్కడా వినిపించడంలేదు. కానీ, ఈ మధ్యనే మళ్ళీ కిరాక్ ఆర్పీ హంగామా మొదలైంది. ఈసారి కామెడీ కాదు, సీరియస్‌గా.!
ఔను, కిరాక్ ఆర్పీ.. కామెడీ పక్కన పెట్టి.. సీరియస్‌గా బిజినెస్‌లోకి దిగాడు. హైద్రాబాద్‌లో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో ఓ కర్రీ పాయింట్ పెట్టాడు. చేపల పులుసు ఇక్కడ ప్రత్యేకమట.!
టేస్ట్ ఎలా వుందబ్బా.?
నిజానికి, చేపల పులుసు అంటే ఎవరికి నోరూరదు.? అందుకే, జనాన్ని ఆ చేపల పులుసుతో గట్టిగా తనవైపకు తిప్పేసుకున్నాడు కిరాక్ ఆర్పీ. పైగా, ప్రచారం విషయంలో పెద్దగా సమస్యలేం లేవు గనుక.. విపరీతంగా పబ్లిసిటీ చేసుకున్నాడు.
అహో.. అద్భుతం.. అమోఘం.. అంటూ కిరాక్ ఆర్పీ చేపల పులుసు కోసం భోజన ప్రియులు.. అందునా, చేపల్ని ఇష్టంగా తినేవారు ఎగబడుతున్నారు. అదే సమయంలో, ‘ఏమంత గొప్పగా లేదు..’ అనేవారూ వున్నారు. ‘చెత్తలా వుంది’ అని విమర్శించేవారూ లేకపోలేదు.
ఎవరేమనుకున్నాసరే.. కిరాక్ ఆర్పీ.. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది.