Neha Dupia: పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన నేహా.. శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్న సెల‌బ్స్

Neha Dupia: అంగద్ బేడీ, నేహా ధూపియా బార్యాభర్తలు అనే సంగతి తెలిసిందే. నేహా ప్రెగ్నెంట్‌గా ఉండి కూడా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. వీరికి మెహర్ అనే కూతురు ఉంది. నేహా రెండో సారి ప్రెగ్నెంట్ అని ఇటీవ‌ల తెలియ‌జేయ‌గా, ఆమె ప్రెగ్రెంట్ వ‌ల‌న ప‌లు సినిమాలు కూడా వ‌దులుకుంది. అంగద్ బేడి కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె ధైర్యవంతురాలు. అందువల్ల ఒప్పుకున్న సినిమాలన్నింటిని సకాలంలో పూర్తి చేసింది. ఆమె ఆరోగ్యమే తనకు మొదటి ప్రాధాన్యమన్నారు.

Neha Dupia Blessed with a Baby Boy
Neha Dupia Blessed with a Baby Boy

41 ఏళ్ల ఈ ముదురు బ్యూటీ 2018లో తనకంటే చిన్నవాడైన నటుడు అంగద్ బేడీని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరేమనుకున్నా ఆమె పట్టించుకోదు. ప్ర‌గ్నెంట్ స‌మ‌యంలో బికినీ ధరించి తన బేబీ బంప్ చూపిస్తూ పూల్ ఒడ్డున కూర్చుని ఎంజాయ్ చేసింది. ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నేహా ధూపియా, అంగద్ బేడీ వివాహం చాలా సీక్రెట్ గా జరిగిపోయింది. 2018లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. వీరిద్దరి వివాహం అంత సీక్రెట్ గా జరగడానికి కారణం ఉంది. నేహా ధూపియా పెళ్ళికి ముందే గర్భవతి అయింది. పెళ్ళికి ముందు నుంచే అంగడి, నేహా ధూపియా రిలేషన్ షిప్ లో ఉన్నారు. దీనితో కుటుంబ సభ్యులు వీరికి సీక్రెట్ గా మ్యారేజ్ చేశారు. అదే ఏడాది నేహా తొలి బిడ్డకు జన్మనిచ్చింది.

తాజాగా నేహా పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ విషయాన్నిఅంగ‌న్ తెలియ‌జేశారు. నేహాకు సినీ సెల‌బ్రిటీలే కాక నెటిజ‌న్స్, అభిమానులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.