Parineethi chopra : పరిణీతి మీద నెగిటివ్ కామెంట్స్ ..ఇప్పుడు ప్రూవ్ చేసుకుంది

Parineethi chopra : పరిణీతి చోప్రా..బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ప్రారంభంలో మంచి హిట్స్ అందుకుంది. ఇషాక్ జాదే లాంటి సినిమాతో రొమాంటిక్ హీరోయిన్ అనే పేరు కూడా సంపాదించుకుంది. వరుసగా హిందీ సినిమాలలో నటిస్తూ స్టార్ గా క్రేజ్ వచ్చేసరికి గ్యారెంటీగా ప్రియాంక చోప్రానే మించిపోతుంది ..అక్కకే గట్టి పోటీ ఇస్తుందని అందరూ భావించారు. అంతేకాదు హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం కూడా గ్యారెంటీ అని చెప్పుకున్నారు.

negative comments on parineethi-chopra...?
negative comments on parineethi-chopra…?

కానీ సీన్ రివర్స్ అయింది. వచ్చిన క్రేజ్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. ఫుల్ ఫాంలో ఉన్న పరిణీతికి కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద తన సినిమాలు ఏవీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. అదే సమయంలో పరిణీతి నటించిన సినిమాలలో తన పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగోలేదనే కామెంట్స్ వినిపించాయి. నేరుగా నీ నటన మెరుగుపరుచుకోకపోతే హీరోయిన్ గా కంటిన్యూ అవడం కష్టం అని మొహం మీద చెప్పారు కూడా. ఇవన్ని ఈమెలో కసిని పెంచాయి. ఈ కామెంట్స్ కి సరైన సమాధానం చెప్పాలనుకుంది.

Parineethi chopra : ‘సైనా’లో నటనకు పరిణీతి మంచి పేరు తెచ్చుకుంది.

ఈ క్రమంలో కథల విషయంలో శ్రద్ద తీసుకుంది. ఒక్కో కథను ఫిల్టర్ చేసి కమిటయింది. ఈ సినిమాల కోసం చాలా శ్రమించింది. దాంతో కేవలం 2 నెలల్లోనే మూడు సినిమాలతో వచ్చి సక్సెస్ అందుకుంది. రీసెంట్‌గా ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ సినిమాతో హిట్ అందుకుంది. ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ లోని నటనకు ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇంతక ముందు కామెంట్ చేసిన వాళ్ళే ఇప్పుడు గ్రేట్ అంటూ పొగుడుతున్నారు. అంతేకాదు ప్రముఖ బ్యాట్‌మెంటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ ‘సైనా’లో నటనకు పరిణీతి మంచి పేరు తెచ్చుకుంది.