భాగమతి సినిమాని చెడగొట్టారంటూ కామెంట్స్ ..ఇందుకు కారణం అనుష్క ..?

అనుష్క శెట్టి టాలీవుడ్ లో అరుంధతి సినిమా తర్వాత టాలీవుడ్ లో కొన్ని ప్రత్యేకమైన సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. పంచాక్షరి .. బాహుబలి ఫ్రాంఛైజీ.. సైజ్ జీరో..భాగమతి లతో అనుష్క క్రేజ్ మరింతగా పెరిగింది. ముఖ్యంగా బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత తెలుగులో అనుష్క నటించిన భాగమతి మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. చంచల, భాగమతి అన్న రెండు విభిన్నమైన పాత్రలు పోషించిన అనుష్క టాలీవుడ్ సినిమా ప్రముఖల నుంచి మాత్రమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా భాగమతి అడ్డా అన్న డైలాగ్ ఇప్పటికి గుర్తు చేసుకుంటారు.

Anushka Shetty's 'Bhaagamathie' trailer is haunting and intriguing

అలాంటి సినిమాని హిందీలో రీమేక్ చేస్తుండటం తో అక్కడ ప్రేక్షకుల తో పాటు మన తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆతృత నెలకొంది. మన అనుష్క పాత్రలో బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ భూమి పడ్నేకర్ నటిస్తోంది. అయితే వాస్తంగా భూమి మంచి నటి కావడంతో భాగమతి రీమేక్ లో తనే కీలక పాత్ర అన్నప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. కాని ఇటీవల భాగమతి హిందీ రీమేక్ దుర్గామతి ట్రైలర్ రిలీజైంది. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న ప్రతీ ఒక్కరు ఈ ట్రైలర్ చూసి బాగా డిసప్పాయింట్ అవుతున్నారట.

durgamathi movie | Moviezupp

భూమి డెఫినెట్ గా మంచి హీరోయిన్ అంటూనే అనుష్క ని మ్యాచ్ చేయలేకపోయిందన్న కామెంట్స్ కూడా చేస్తున్నారట. ఇంకా చెప్పాలంటే అనుష్క తో ఏమాత్రం భూమి సరితూగలేదన్న మాట వినిపిస్తోంది. దుర్గామతి ట్రైలర్ సపరేట్ గా చూస్తే కాస్త పరవాలేదని అంటున్నప్పటికి భాగమతి ట్రైలర్ తో అనుష్క పర్ఫార్మెన్స్ తో పోలిక పెట్టి చూస్తున్నారట. మరి ట్రైలర్ కే ఇలాంటి కామెంట్స్ వస్తే రేపు సినిమా రిలీజయ్యాక ఎలాంటి కామెంట్స్ వస్తాయో చూడాలి. అయితే ఈ సినిమా హిందీ రీమేక్ లో కూడా అనుష్క ని నటించమనే మేకర్స్ అడిగినప్పటికి అనుష్క ఒప్పుకోలేదన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ అనుష్క గనక ఒప్పుకొని ఉంటే ఈరోజు ఇలాంటి కామెంట్స్ వచ్చేవి కావేమో.

Advertisement