Samantha: సమంత పిల్లలు కనడానికి రెడీ అయ్యింది కానీ ఇంతలోనే.. : నీలిమ

Samantha: అక్టోబ‌ర్ 2 స‌మంత‌- నాగ చైత‌న్య త‌మ డైవ‌ర్స్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌కట‌న చేసిన‌ప్ప‌టి నుండి సోష‌ల్ మీడియాలో వీరిద్ద‌రి గురించి మారుమ్రోగిపోతుంది. నాగ చైతన్య, సమంతలు ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. ఇక అప్పటి నుంచి చైతన్య, సమంతల మధ్య ఏం జరిగి ఉంటుంది? ఎందుకు విడాకులు తీసుకుని ఉంటారు? అనే వాటిపై చర్చలు జరుగుతున్నాయి. తాజాగా శాకుతంలం చిత్ర నిర్మాత నీలిమ కొన్ని కామెంట్స్ చేసింది.

శాకుంతలం సినిమా కోసం మా నాన్న(దర్శకుడు గుణశేఖర్‌) సమంతను సంప్రదించాడు. అయితే అప్పటికే ఆమె సినిమాలు చేయకూడదని ఫిక్స్‌ అయింది. ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నామని, ఇప్పట్లో మూవీ చేయనని చెప్పింది. కానీ, శాకుంతలం కథ నచ్చడంతో కొన్ని కండిషన్స్‌ పెట్టి ఓకే చెప్పింది. త్వరగా షూటింగ్‌ పూర్తి చేయాలని చెప్పింది.

ఈ మూవీ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకోవాలని సమంత నిర్ణయం తీసుకుంది. ఆమె తల్లి కావాలని కోరుకుంది. జూలై, ఆగస్ట్‌లోకెల్లా షూటింగ్ పూర్తిచేయాలని సామ్‌ కోరడంతో.. మేము ఓకే చెప్పి అలానే ప్లాన్‌ చేసుకున్నాం. ఆమె సినిమాలకు విరామం ఇచ్చి, పిల్లల్ని కనేందుకు ప్లాన్‌ చేసుకుంది.

ఇప్పుడు చై-సామ్‌లు సడెన్‌గా విడిపోవడం షాకింగ్‌గా ఉంది’ అని నీలిమా చెప్పుకొచ్చింది. కాగా, విడాకులు త‌ర్వాత సమంతపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరుగుతోంది. సామ్‌ పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని.. ఇప్పటికే రెండు సార్లు అబార్షన్‌ చేయించుకుందని..అందుకే చైతన్య విడాకులు ఇచ్చాడనే పుకార్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీటిపై సమంత సీరియస్‌ అయింది.

‘నన్ను కొందరు వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి, నాకు అఫైర్స్‌ ఉన్నాయని, అబార్షన్స్‌ చేయించుకున్నానని, నేను అవకాశవాదినని అంటున్నారు. విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతో కూడుకున్నది. కొంత స్వాంతన పొందడానికి నన్ను ఒంటరిగా వదిలేయండి’ అని సామ్‌ విజ్ఞప్తి చేసింది.