Aryan: డ్ర‌గ్స్ కేసు: ఆర్య‌న్ విడుద‌ల కావ‌లంటే పాతిక ల‌క్ష‌లు ఇవ్వాలి

Aryan షారూఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్.. ముంబైలోని క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ సేవించి పార్టీ చేసుకుంటూ పోలీసులకు దొరికిన విష‌యం తెలిసిందే. ఆర్య‌న్ ఖాన్ బెయిల్ కోసం షారూఖ్ మూడు సార్లు ప్ర‌య‌త్నించ‌గా, నిరాశే ఎదురైంది. దీంతో స్వ‌యంగా ఆర్య‌న్ ఖాన్‌కి ప‌రామ‌ర్శించేందుకు ఇటీవ‌ల జైలుకి వెళ్లాడు షారూఖ్‌.

ఆర్యన్ ఖాన్ కేసులో సాక్షిగా ఉన్న ఓ వ్యక్తి తాజాగా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనానికి కారణమవుతున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు రూ.25 కోట్లు చెల్లిస్తే ఆర్యన్ ఖాన్ ను వదిలేసేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు ఈ సాక్షి చెప్పడం కలకలం రేపుతోంది.

ముంబై డ్రగ్ బస్ట్ కేసులో అరెస్టయిన ఆర్యన్‌ఖాన్‌ను విడిచిపెట్టేందుకు ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తరపున రూ.25 కోట్లు డిమాండ్ చేశారని సాక్షి ఆరోపించారు. అంతే కాకుండా ఎన్‌సీబీ అధికారులు చ‌ర్చ‌ల స‌మ‌యంలో తాను ఉన్న‌ట్లు ఆయ‌న మీడియా ముందు విష‌యాన్ని బ‌హిర్గ‌తం చేయ‌డ‌మే కాకుండా త‌న అఫిడివిట్‌లో కూడా పేర్కొన్నారు.

నోటరీ చేయబడిన అఫిడవిట్‌లో, ఎన్సీపీ సాక్షి కెపి గోసావి యొక్క బాడీగార్డ్ అయిన ప్రభాకర్ సెయిల్, ముంబై డ్రగ్ బస్ట్ కేసు వెనుక ఎన్‌సిబి అధికారి సమీర్ వాంఖడే తరపున గోసావి రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం పెను సంచలనం రేపుతోంది.

నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోతో జ‌రిపిన ఈ డీల్‌లో ముందు శామ్ డిసౌజా అనే వ్య‌క్తితో గోస‌వి మాట్లాడార‌ని, త‌ర్వాత షారూక్ మేనేజ‌ర్ పూజా ద‌డ్లానితోనూ ఈ డీల్ గురించి మాట్లాడార‌ని.. ఎన్‌సీబీ జోన‌ల్ డైరెక్ట‌ర్ స‌మీర్ వాంఖ‌డేకు ఇందులో ఎనిమిది కోట్ల రూపాయ‌లు ఇచ్చేలా డీల్ కుదిరింద‌ని ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు.

ఈ ప‌రిస్థితుల‌పై ఎన్‌సీబీ జోన‌ల్ డైరెక్ట‌ర్ స‌మీర్ వాంఖ‌డె స్పందిస్తూ ప్ర‌భాక‌ర్ సాయ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. ఎన్‌సీబీ ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌ను మంటగ‌లిపే ప్ర‌య‌త్నంలో భాగ‌మే ఇద‌ని అధికారులు తెలిపారు. సాక్షి అడ్డం తిరిగాడ‌ని వారు తెలిపారు. ప్ర‌భాక‌ర్ ఈ కేసులో సాక్షి మాత్ర‌మే. ఏమైనా చెప్పుకోవాలంటే కోర్టులున్నాయి. చెప్పుకోవ‌చ్చు. కానీ మీడియా ముందు చెప్పుకోవ‌డం చూస్తుంటే అనుమానంగా ఉంది అని తెలిపారు.