Nayanthara:పెళ్లిపై త‌న నిర్ణ‌యం మార్చుకున్న న‌య‌న‌తార‌.. ఇక వ‌చ్చే ఏడాదే అని టాక్..!

Samsthi 2210 - May 10, 2021 / 05:26 PM IST

Nayanthara:పెళ్లిపై త‌న నిర్ణ‌యం మార్చుకున్న న‌య‌న‌తార‌.. ఇక వ‌చ్చే ఏడాదే అని టాక్..!

తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. సౌత్ లోనే బాగా పేరు తెచ్చుకున్న లవర్స్ నయనతార, విఘ్నేష్ శివన్. ఎక్కడ చూసినా కూడా ఈ ఇద్దరే కనిపిస్తుంటారు. ఎప్పటికప్పుడు పెళ్లి చేసుకంటారు అనే టాక్ వినిపిస్తుంది కానీ అది మాత్రం జరగదు. ఇహనో ఇప్పుడో పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి కానీ వాళ్లు మాత్రం తమ పని తాను చేసుకుంటారు.. చూసుకుంటారు కానీ పెళ్లి విషయం మాత్రం బయటికి రానివ్వరు. కలిసి పండగలు చేసుకుంటారు.. ఎప్పుడూ కలిసే ఉంటారు.. సహజీవనం చేస్తుంటారు కానీ ఒక్కటవుతారా అనే ప్రశ్న వస్తే మాత్రం నో అంటారు. సోషల్ మీడియాలో ఈ ఇద్దరి ఫోటోలకు, పోస్టులకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. మొన్నామధ్య ఈ ఇద్దరూ కలిసున్న ఓ ప్రైవెట్ స్టిల్ బయటికి వచ్చింది.

రూమ్ లో ఒంటరిగా ఉన్నపుడు బయటికి వచ్చిన ఈ ఫోటో వైరల్ అయింది. ఇంత దగ్గరగా ఉన్నా కూడా పెళ్లి విషయంలో మాత్రం దూరంగానే ఉంటున్నారు నయన్, విఘ్నేష్. గాలి కూడా తమ మధ్య దూరనంత దగ్గరగా హత్తుకుపోయి కనిపిస్తున్న ఈ జంట.. పెళ్లంటే మాత్రం చాలా దూరం వెళ్తున్నారు. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా వీళ్లకు అనే అనుమానాలు కూడా అప్పుడప్పుడూ వచ్చేలా ప్రవర్తిస్తుంటారు. మళ్లీ అంతలోనే కలిసిపోతుంటారు. ఏ పండగ వచ్చినా కూడా ఇద్దరూ కలిసే సెలబ్రేట్ చేసుకుంటారు. తాజాగా ఈ ఇద్దరి పెళ్లి గురించి మరోసారి టాపిక్ వచ్చింది.

2021లో వీళ్లు ఒక్కటి కాబోతున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలొస్తున్న తరుణంలో చివరి నిమిషంలో నయన్ మళ్లీ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడు కాదు.. మరో ఏడాది ఆగాలంటూ విఘ్నేష్ కుటుంబాన్ని అడిగినట్లు సోషల్ మీడియాలో కొత్త వార్త హల్ చల్ చేస్తుంది. దీనికి అక్కడ్నుంచి మాత్రం సమాధానం కాస్త తేడాగా వచ్చిందని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రియుడి దర్శకత్వంలో ప్రస్తుతం నటిస్తుంది నయనతార. విజయ్ సేతుపతి ఇందులో హీరోగా నటిస్తున్నాడు. అటు వైపు సినిమాలు.. ఇటు వైపు పర్సనల్ లైఫ్ రెండూ పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు ఈ ప్రేమ జంట. ప్రేమలోనే ఉన్న ఈ జంట పెళ్ళి పీటల వరకు ఎప్పుడెళ్తారో చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us