Nayanthara : టాలీవుడ్ సీనియర్ హీరోలపై నయనతార సెన్సేషనల్ కామెంట్స్.!
NQ Staff - December 21, 2022 / 12:04 PM IST

Nayanthara : నయనతార తమిళ సినీ పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్.! హీరోయిన్ అనాలా.? ప్రముఖ నటి అనాలా.? ఏదైనా అనుకోండి.. ఆమె తర్వాతే ఎవరైనా తమిళ సినీ పరిశ్రమలో.. స్టార్డమ్ పరంగా.! రెమ్యునరేషన్లోనూ ఆమె తర్వాతే ఏ నటి అయినా.
తన తాజా సినిమా ప్రమోషన్ల సందర్భంగా నయనతార, టాలీవుడ్ సినీయర్ హీరోలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు టాలీవుడ్ అగ్రహీరోలతోనూ సినిమాలు చేసింది నయనతార.
బాలకృష్ణతో ఆ విషయం చెప్పాలంటే భయమే..
ఇంకో టేక్ కావాలని బాలకృష్ణను అడగాలంటే ఎవరైనా భయపడతారనీ, బాలకృష్ణ మాత్రం ఎప్పుడూ ఆనందంగా వుంటారని నయనతార చెప్పింది.
చిరంజీవి అయితే ఎప్పుడూ స్టార్డమ్గానీ, ఆటిట్యూడ్గానీ ప్రదర్శించరన్నది నయనతార అభిప్రాయం. నాగార్జునని ఛార్మింగ్ హీరో అని అభిప్రాయపడింది. వెంకటేష్ తన కుటుంబ సభ్యుల్లో ఒకరని చెప్పింది నయనతార.
రవితేజ గురించి మాట్లాడుతూ, అతను తనకు బెస్ట్ ఫ్రెండ్ అని నయనతార చెప్పడం గమనార్హం.
అయితే, తమిళ సినిమాల్ని ప్రమోట్ చేయడానికి కొంత సమయం కేటాయించే నయనతార, తెలుగు సినిమాల్ని మాత్రం అస్సలు ప్రమోట్ చేయదు. మొన్నీమధ్యనే నయనతార ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.