Nayanthara : నయనతార అసభ్యకరమైన డ్రస్సు : చిన్మయికెందుకు.?
NQ Staff - December 26, 2022 / 09:12 AM IST

Nayanthara : చాలాకాలం తర్వాత తన సినిమాల ప్రమోషన్ కోసం మీడియా ముందుకొచ్చింది నయనతార. బహుశా తన భర్త నిర్మాణంలో తాను నటించిన సినిమా కావడం వల్లనే ‘కనెక్ట్’ సినిమాని తమిళ, తెలుగు భాషల్లో ఆమె స్వయంగా ప్రమోట్ చేసుకుని వుండొచ్చు.
తమిళనాడులో సినిమా ప్రమోషన్ కోసం శరీరానికి అతుక్కుపోయే డ్రస్ వేసుకొచ్చింది నయనతార. ఆమె టాప్ అసభ్యకరంగా వుందంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు జుగుప్సాకరమైన కామెంట్లు ఆమె మీద సంధిస్తున్నారు.
క్లాస్ తీసుకున్న చిన్మయి..
నయనతార డ్రెస్సు విషయమై వస్తున్న కామెంట్లపై సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఆ బూతు కామెంట్లను తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేస్తూ, మగాళ్ళ బుద్ధి మారాలంటూ మండిపడింది.
ఎవరో నయనతారని విమర్శిస్తే నీకెందుకు.? నిన్ను తిట్టలేదనే కదా.? కావాలంటే నువ్వూ తిట్టించుకో.. అంటూ కొందరు నెటిజన్లు చిన్మయిపై ఎదురుదాడికి దిగుతున్నారు.
చిన్మయి ఇలా వివాదాస్పద అంశాలతో వార్తల్లోకెక్కడం కొత్తేమీ కాదు. మొత్తంగా మహిళామణుల తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు చిన్మయి ఎందుకు వ్యవహరిస్తుంటుంది.? ఇదంతా అటెన్షన్ కోసమేనేమో.. అన్నది కొందరు నెటిజన్ల భావన.