Nayanthara: తండ్రికి అస్వ‌స్థ‌త‌.. త్వ‌ర‌లో పెళ్లి చేసుకోవాల‌ని న‌య‌న‌తార నిర్ణ‌యం

Samsthi 2210 - July 31, 2021 / 03:43 PM IST

Nayanthara: తండ్రికి అస్వ‌స్థ‌త‌.. త్వ‌ర‌లో పెళ్లి చేసుకోవాల‌ని న‌య‌న‌తార నిర్ణ‌యం

Nayanthara: లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార తండ్రి కురియన్ కొడియట్టు తీవ్ర అస్వస్థతకు గుర‌య్యార‌నే వార్త‌లు కోలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌స్తుతం అత‌ని ఆరోగ్యం అంత‌గా బాగోలేద‌ని ఐసీయూలో చికిత్స పొందుతున్న‌ట్టు స‌మాచారం. అయితే ఇటీవ‌ల తండ్రి ఆరోగ్యం పూర్తిగా క్షీణించ‌డంతో న‌య‌న‌తార ప్ర‌త్యేక విమానంలో కొచ్చికి వ‌చ్చిన‌ట్టు సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు వ‌చ్చాయి.

చ‌నిపోయే లోపు త‌న కూతురి పెళ్లి వేడుక చూడాల‌ని తండ్రి ముచ్చ‌ట‌ప‌డుతున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఆమెతో కూడా ప‌లుమార‌లు చ‌ర్చించార‌ట‌. అయితే నాలుగేళ్లుగా విఘ్నేశ్‌తో ప్రేమలో ఉన్న నయనతార పెళ్లిని వాయిదా వేస్తూ వ‌స్తుంది. దానికి కారణం నయనతార తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడమే. కాని ఇప్పుడు తండ్రి అనారోగ్యం దృష్ట్యా విఘ్నేష్‌తో త్వరలోనే పెళ్లి చేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి

ఇటీవ‌ల త‌న ఫ్యాన్స్‌తో సోష‌ల్ మీడియాలో ముచ్చ‌టించిన విఘ్నేష్ శివ‌న్ త‌న పెళ్లి విష‌యంపై నోరు విప్పాడు. వివాహం డ‌బ్బుల‌తో కూడుకుంద‌ని, ఇప్ప‌టి నుండే డ‌బ్బులు సేవ్ చేసుకొని త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటామ‌ని విఘ్నేష్ శివ‌న్ అన్నారు. న‌య‌న‌తార గ‌తంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమ‌లో ఉండ‌గా వారిద్ద‌రికి బ్రేక‌ప్ చెప్పి ఇప్పుడు విఘ్నేష్ శివ‌న్‌తో ప్రేమాయ‌ణం సాగిస్తున్నారు.

ప్ర‌స్తుతం న‌య‌న‌తార ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రంలో మ‌హేష్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మేకర్స్.. నయన్‏తో చర్చలు జరుపుతున్నారని టాక్. ఒకవేళ నయన్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మహేష్ సరసన మొదటి సారి నయన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని చెప్పవచ్చు. ఇక రజనీకాంత్ ‘అన్నాత్తే’ సినిమాలోనూ నయనతార ఫీమేల్ లీడ్ గా కనిపించనుంది.

‘నెట్రికన్’, ‘అన్నాత్తే’ కాకుండా ప్రియుడు విఘ్నేశ్ సినిమాలోనూ అందాల తార నటిస్తోంది. ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలో విజయ్ సేతుపతి, సమంతలతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది న‌య‌న్.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us