Nayanthara And Vignesh Sivan : సరోగసీ వివాదం : నయనతార, విఘ్నేష్ శివన్ పెద్ద తప్పు చేశారా.?

NQ Staff - October 13, 2022 / 06:51 PM IST

Nayanthara And Vignesh Sivan : సరోగసీ వివాదం : నయనతార, విఘ్నేష్ శివన్ పెద్ద తప్పు చేశారా.?

Nayanthara And Vignesh Sivan : దేశంలో సరోగసీ అనేది కొత్త విషయం కాదు. చాలామంది సినీ ప్రముఖుల సరోగసీ విధానంలో తల్లిదండ్రులయ్యారు. బాలీవుడ్ నటులు ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా చాలా పెద్దదే. సన్నీలియోన్ ఓ చిన్నారిని (అమ్మాయి) దత్తత తీసుకోగా, ఇద్దరు మగ పిల్లలకు తల్లయ్యింది మాత్రం సరోగసీ విధానంలోనే.

బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్, సరోగసీ ద్వారానే తండ్రయ్యారు.. ఆయన సింగిల్ పేరెంట్. అసలాయనకు పెళ్ళి కాలేదు. తుషార్ కపూర్ అనే మరో నటుడు కూడా సింగిల్ పేరెంట్. వాళ్ళెవరికీ సరోగసీ విషయంలో రాని ఇబ్బందులు నయనతారకు ఎందుకు వచ్చినట్లు.?

ట్విన్స్.. పైగా, అబ్బాయిలు..

నయనతార – విఘ్నేష్ శివన్ ఇటీవల పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళయి నాలుగు నెలలే అవుతోంది. ఇంతలోనే, ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులైపోయారు.. అదీ సరోగసీ విధానంలో. దాంతో, ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందట.

జనవరి 2022 నుంచి అమల్లోకి వచ్చిన సరోగసీ చట్టానికి వ్యతిరేకంగా నయనతార – విఘ్నేష్ శివన్ దంపతులు వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, అసలు ఆ కవల పిల్లలు ఎక్కడ పుట్టారు.? అన్నదానిపై స్పష్టత లేదు.

దాంతో, ఈ మొత్తం వ్యవహారంపై ఆరా తీసేందుకు తమిళనాడు ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసిందట. రాష్ట్రంలో అక్రమంగా సరోగసీ వ్యవహారాలు నడుస్తున్నాయా.? అన్న అంశంపై ఈ కమిటీ విచారణ చేపట్టబోతోందిట. అంటే, నయనతార దంపతులు సరోగసీ వివాదంలో నిండా మునిగిపోయినట్లే భావించాలా.?

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us