Nayanthara: హిందూ- క్రైస్త‌వ సంప్రదాయం ప్ర‌కారం న‌య‌నతార పెళ్లి.. ఏ నెల‌లో జ‌రగ‌నుందో తెలుసా?

Samsthi 2210 - February 26, 2021 / 04:03 PM IST

Nayanthara: హిందూ- క్రైస్త‌వ సంప్రదాయం ప్ర‌కారం న‌య‌నతార పెళ్లి.. ఏ నెల‌లో జ‌రగ‌నుందో తెలుసా?

Nayanthara టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో గ‌త ఏడాది మొద‌లైన పెళ్ళిళ్ళ హంగామా ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. దిల్ రాజు రెండో పెళ్లి నుండి మొద‌లు పెడితే నిఖిల్, నితిన్, రానా, కాజ‌ల్, సుజీత్, నిహారిక‌, జ‌బ‌ర్ధ‌స్త్ మ‌హేష్‌, సునీత ఇలా ప‌లువురు ప్రముఖులు పెళ్ళి పీట‌లెక్కి ఆ హంగామాకు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ వ‌చ్చారు. ఇవి చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇక ఈ ఏడాది కూడా కొంద‌రి పెళ్లిపై అనేక వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇందులో ఎంత క్లారిటీ ఉంద‌ని తెలుసుకోవ‌డానికి వారివారి అభిమానులు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు.

కొన్నాళ్ళుగా సౌతిండియన్ లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార పెళ్లికి సంబంధించిన అనేక వార్త‌లు కోకొల్ల‌లుగా వ‌స్తున్నాయి. ప్ర‌భుదేవా, శింబుల‌కు బ్రేక‌ప్ చెప్పాక న‌య‌న‌తార విఘ్నేష్ శివ‌న్ ప్రేమ‌లో ఉండ‌గా, వీరి పెళ్లి 2019లో ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం చేశారు. ఆ సంవ‌త్స‌రం అలా ముగిసిపోయింది. 2020లో ప‌క్కా అని అన్నారు. క‌రోనా వ‌ల‌న ఆగింద‌ని చెప్పుకొస్తున్నారు. ఈ ఏడాది మాత్రం ఏదేమైన న‌యనతార పెళ్లి జ‌ర‌గ‌డం ఖాయమంటూ గాసిప్ రాయుళ్ళు జోరుగా ప్ర‌చారం చేస్తున్నారు.

తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్-నయనతార చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. దాదాపు ఐదేళ్ల నుంచి వీరి సహజీవనం కొనసాగుతోంది. ఇద్ద‌రు షికార్లకు వెళ్ల‌డం, వేడుక‌లు క‌లిసి జ‌రుపుకోవ‌డం ఇలా అన్నీ జ‌రుగుతున్నా పెళ్ళి మాట మాత్రం ఎత్త‌డం లేదు. ఏదేమైన ఇరువురి పెద్ద‌లు మార్చిలో న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్‌ల‌కు పెళ్లి చేయాల‌ని నిశ్చ‌యించిన‌ట్టు స‌మాచారం. లేట్ చేసిన బాగుండ‌ద‌ని భావించిన వారు ఈ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని టాక్. వీరి పెళ్లి హిందూ క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం జరుగుతుందని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. విఘ్నేష్ శివ‌న్- న‌య‌న‌తారల మ‌ధ్య ప్రేమ 2015 తమిళ చిత్రం ‘నానుమ్ రౌడీ ధాన్’ షూటింగ్ స‌మ‌యంలో పుట్టింది. ఇది ఎప్పుడు పెళ్లిగా మార‌నుందో చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us