Chiranjeevi : చిరంజీవి ప‌క్క‌న న‌టించేందుకు ఆ హీరోయిన్ నాలుగు కోట్లు డిమాండ్ చేసిందా..!

Chiranjeevi : సీనియ‌ర్ హీరోల ప‌క్క‌న న‌టించేందుకు హీరోయిన్స్ భారీ పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే మెహ‌రీన్.. నాగార్జున ప‌క్క‌న న‌టించేందుకు కోటిన్న‌ర అడిగింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీనికి షాకైన నిర్మాత‌లు ఆమెను కాద‌ని మ‌రో హీరోయిన్‌ని వెతికే పనిలో ప‌డ్డ‌ట్టు స‌మాచారం. తాజాగా చిరంజీవి స‌ర‌స‌న న‌టించేందుకు కూడా న‌య‌న‌తార భారీగా డిమాండ్ చేసిన‌ట్టు తెలుస్తుంది.

TheNewsQube-
Nayanatara remuneration for Chiranjeevi Godfather
Nayanatara remuneration for Chiranjeevi Godfather

లేడీ సూపర్ స్టార్ నయనతార తమిళంలో ఈమద్య కాలంలో చేసిన పలు సినిమాలకు 3.5 కోట్ల నుండి 4.5 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లుగా తమిళ మీడియా వర్గాల వారు చెబుతున్నారు. హీరోల రేంజ్ లో ఈ అమ్మడి పారితోషికం పెరుగుతూ వస్తోంది. అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు అయితే ఈ రేంజ్ పారితోషికం సరే కాని.. హీరోలతో కలిసి నటించే సినిమాలకు ఇంత పారితోషికం అంటే ఖచ్చితంగా కష్టమే అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Nayanatara remuneration for Chiranjeevi Godfather
Nayanatara remuneration for Chiranjeevi Godfather

తాజాగా గాడ్ ఫాదర్ సినిమా కోసం ఈమె ఏకంగా నాలుగు కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లుగా వస్తున్న వార్తలు ఆశ్చర్యంగా ఉన్నాయి. సినీ జనాలతో పాటు మీడియా వర్గాల వారు కూడా నయన్ కు నాలుగు కోట్లు నిజం అయ్యి ఉంటుందా అంటూ చర్చించుకుంటున్నారు.

చిరంజీవి సినిమాలో ఇతర నటీ నటులకు అంత పారితోషికం ఉండటం చాలా అరుదుగా జరుగుతుంది. ఒక వేళ అదే కనుక నిజం అయితే ఖచ్చితంగా రికార్డు అనడంలో సందేహం లేదు. హీరోయిన్ కాకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించినందుకు అంత పారితోషికం దక్కడం నిజంగా చాలా పెద్ద విషయం అనడంలో సందేహం లేదు.

నయనతార గతంలో చిరంజీవితో జోడీగా సైరాలో హీరోయిన్ గా నటించిన సమయంలో రెండు కోట్ల లోపు పారితోషికంనే తీసుకుందట. ఇంతలో ఇంత మార్పు ఏంటో అంటూ అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ పారితోషికం వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాలంటే గాడ్ ఫాదర్ నిర్మాత లేదా దర్శకుడు మోహన్ రాజా స్పందించాల్సిందే.