God father : గాడ్ ఫాద‌ర్‌లో నయ‌న తార‌.. అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన మేక‌ర్స్

God father : ఈ రోజు సౌతిండియ‌న్ లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార 37వ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా అభిమానుల‌కి స‌ర్‌ప్రైజ్‌లు వ‌చ్చేస్తున్నాయి. తాజాగా గాడ్ ఫాద‌ర్ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించ‌నుందంటూ ప్ర‌క‌టించారు. ఈరోజు నయన్ పుట్టిన రోజు సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార నటించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు నయన్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‏గా దూసుకుపోతుంది నయనతార.

Nayanatara in megastar movie God father
Nayanatara in megastar movie God father

చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాడ్‌ ఫాదర్‌’. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మలయాళంలో మంజు వారియర్‌ పాత్రను తెలుగులో నయన్‌, ఆమె భర్తగా వివేవ్‌ ఒబెరాయ్‌ పాత్రను సత్యదేవ్‌ పోషిస్తున్నారు. అయితే, ఈ విషయమై నయన్‌ ఒక కండీషన్‌ పెట్టినట్లు తెలుస్తోంది. తన భర్త పాత్రలో గుర్తింపు ఉన్న నటుడిని కాకుండా యువ కథానాయకుడిని పెట్టడం పట్ల ఆమె అసంతృప్తితో ఉన్నారట. తనకు జోడీగా నటించేంత పాపులారిటీ ఆయనకు లేదు కదా! అన్నట్లు సమాచారం.

దీనిపై చిత్ర బృందం స్పందిస్తూ, చిరంజీవి తర్వాత అనుకున్న ముఖ్య పాత్రల్లో సత్యదేవ్‌ కూడా ఉన్నారని, ఇప్పుడు మార్చడం సాధ్యమయ్యే పని కాదని ఆమెతో అన్నట్లు తెలిసింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక న‌య‌న్ విష‌యానికి వ‌స్తే దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‏గా దూసుకుపోతుంది నయనతార. ఇప్పుడున్న నటీమణులలో హీరోలతో సరిసమానంగా అత్యంత పారితోషికం అందుకున్న హీరోయిన్ నయన్. ఇప్పటికే చిరు సరసన సైరా నరసింహ రెడ్డి సినిమాలో నటించి మెప్పించింది నయన్.