Naveen Polishetty: జాతిర‌త్నాలు హీరో సినిమా నిర్మించబోతున్న మాటల మాంత్రికుడు

Naveen Polishetty: మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ర‌చ‌యిత‌గా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ద‌ర్శ‌కుడిగా వైవిధ్య‌మైన చిత్రాలు తెర‌కెక్కించి టాలీవుడ్ టాప్ ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. త్వ‌ర‌లో మ‌హేష్ బాబుతో ఓ సినిమా చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకు మాట‌లు అందిస్తున్నారు.

Naveen Polishetty next Movie Produced By Trivikram
Naveen Polishetty next Movie Produced By Trivikram

రాజమండ్రి అవుట్ స్కర్ట్స్ లో ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ అనే పేరుతో ఆయనకు థియేటర్ వుంది. అదే పేరును ఇప్పుడు బ్యానర్ గా మార్చారు. ఇప్పుడు ఆ బ్యాన‌ర్‌పై సినిమాలు నిర్మించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ తో సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాని నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు.

ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ వారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “భీమ్లా నాయక్” సహా మరెన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌- త్రివిక్ర‌మ్ క‌లిసి నిర్మిస్తున్న సినిమాలో జాతిర‌త్నాలు హీరో న‌వీన్ పోలిశెట్టి న‌టించ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తోనే సూపర్ హిట్ ని అందుకున్నాడు న‌వీన్‌. తాజాగా విడుదలైన “జాతిరత్నాలు” కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇక నవీన్ పోలిశెట్టి తదుపరి సినిమా గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాతి రత్నాలు సినిమా బ్లాక్బస్టర్ అవ్వడం తో నవీన్ పోలిశెట్టి మీద ఆఫర్ల వర్షం కురిసింది. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా ఒక సినిమా తెరకెక్కనుంది అని పుకార్లు పుట్టుకొచ్చాయి కానీ దాని గురించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.