Naveen: ఒక్క ట్వీట్‌తో జాబ్ పోయిన వ్య‌క్తికి ఉద్యోగం ఇప్పించిన జాతిర‌త్నం

Naveen: క‌రోనా కార‌ణంగా ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చాలా మంది ఉద్యోగులు ఉద్యోగం కోల్పోవ‌ల‌సి వ‌చ్చింది. జాబ్ లేక‌పోవ‌డంతో వారి ప‌రిస్థితి ధైన్యంగా మారింది. ఇలాంటి వారికి సోనూసూద్ వంటి సెలబ్రిటీలు త‌మ వంతు సాయం చేశారు. జాతిర‌త్నాలు ఫేం న‌వీన్ పోలిశెట్టి కూడా త‌న వంతు సాయం అందించేందుకు ప్ర‌య‌త్నించాడు.ఈ క్ర‌మంలో ఓ ఉద్యోగికి ఒక్క ట్వీట్‌తోనే జాబ్ తెప్పించాడు.

వివ‌రాల‌లోకి వెళితే స‌మీర్ అనే వ్య‌క్తి.. క‌రోనా వ‌ల‌న ఉద్యోగం కోల్పోయాడు. చరణ్, సౌమ్య అనే ఇద్దరు నెటిజన్లు.. సమీర్ అనే వ్యక్తి కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయి కష్టాల్లో ఉన్నాడని.. ఎవరైనా హెల్ప్ చేయాలంటూ ట్వీట్ చేశారు. ఈ విషయం నవీన్ పోలిశెట్టి దృష్టికి వచ్చింది. వెంటనే సదరు వ్యక్తి వివరాలను పేర్కొంటూ హైదరాబాద్ ఎక్కడైనా ఉద్యోగం ఉంటే చెప్పాలంటూ కోరాడు. అంతే నవీన్ చేసిన ట్వీట్‌కు ఈవోక్-వేగాన్ స్టోర్ & కేఫ్ సమీర్‌కు ‘స్టోర్ కమ్ కేఫ్ మేనేజర్‌గా ఉద్యోగాన్ని కల్పించింది.

సమీర్ కి ఉద్యోగం లభించిన విషయాన్ని ట్వీట్ చేస్తూ నవీన్ తన సంతోషాన్ని తెలియచేశారు. ఈ వోక్ సంస్థ కి వచ్చి సిబ్బందిని కలుస్తానని అన్నాడు. ఈ కష్ట సమయంలో ఉద్యోగం కోల్పోయిన వారికి తమ వంతు సహాయం చేయాలని అందరినీ నవీన్ కోరాడు. ఇక తనకి సమీర్ గురించిన సమాచారం అందించిన ఇద్దరు నెటిజన్లకి ధన్యవాదాలు చెప్పారు.

ఆప‌ద‌లో ఉన్న వారికి తన వంతు సాయం చేస్తున్న ఈ కుర్ర హీరోపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.స్క్రీన్ రైటర్‌గా కెరియర్ స్టార్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో నటుడిగా నిదొక్కున్నాడు. ఇక ‘జాతి రత్నం’ చిత్రంతో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రంలోని నవీన్ పోలిశెట్టి మేనరిజంతో థియేటర్స్‌లో ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేట్టు చేశాడు. త్వ‌ర‌లో అనుష్క తో ఒక చిత్రంలో నటించబతున్నారు అని సమాచారం.