Naveet kaur: ప్రముఖ సినీనటి, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ఆ మధ్య తిరుమలకు వచ్చిన ఈమె తెలుగు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. తెలుగు ప్రజల వల్లే తనకు పేరొచ్చిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, మహిళలు, యువతకు, సహాయం చేస్తానని నవనీత్ కౌర్ తెలిపారు.

శీను వాసంతి లక్ష్మీ, మహారథి లాంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఈమె.. పార్లమెంటరీయన్‌గా మారిపోయారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఆమె.. ఐదుసార్లు ఎంపీగా పని చేసిన సీనియర్ నాయకుడిని ఓడించి మరీ ఆమె గెలవడం విశేషం. ఆమె అనేక మంచి కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు.
తాజాగా ఒంటెల వధను అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ అడ్డుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా ఒంటెలను తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న నవనీత్ కౌర్.. మూగజీవాల ప్రాణాలను కాపాడారు. 1100 కి.మీ. నుంచి ఒంటెలను వధించేందుకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న 60 మూగజీవాల ప్రాణాలను నవనీత్ కౌర్ కాపాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘ ఇప్పటికే చాలా ఒంటెలను హైదరాబాద్‌కు తరలించారు. అమరావతి నియోజకవర్గంలో ఒంటెలను ఉంచినట్టు నాకు సమాచారం అందింది. వెంటనే అధికారులకు సమాచారం అందించాను. అధికారులు స్పందించి ఒంటెలను స్వాధీనం చేసుకున్నారు.’’ అని తెలిపారు.

బాబా రాందేవ్‌ను ఫాలో అయ్యే నవనీత్ కౌర్‌కు యోగా క్యాంపులో రాజకీయ నాయకుడైన రవి రాణాతో పరిచయం ఏర్పడింది. తర్వాత 2011లో బాబా రాందేవ్ సమక్షంలోనే వాళ్లిద్దరూ పెళ్లాడారు. అలా ఆమెకు రాజకీయాలతో అనుబంధం ఏర్పడింది. ఆమె భర్త రవి రాణా బద్నేరా నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఇండిపెండెంట్‌గా విజయం సాధించడం గమనార్హం.