Puneeth: నాటు నాటు సాంగ్ పునీత్ స్టైల్‌లో అదిరిపోయిందిగా…!

Puneeth: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ . ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాపై దేశం మొత్తం సినీ అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుండి ‘నాటు నాటు’ సాంగ్ విడుదలయ్యాక ఆ అంచనాలు తారా స్థాయికి చేరాయి. దేశవ్యాప్తంగా అభిమానుల నుంచి ఈ సాంగ్ లో చరణ్, ఎన్టీఆర్ స్టెప్పులని ట్రై చేస్తూ కుప్పలు తెప్పలుగా వీడియోలు వస్తున్నాయి.

natu natu song in puneeth style
natu natu song in puneeth style

ఎన్టీఆర్, చరణ్ మెరుపు వేగంతో డాన్స్ చేస్తూ అలరిస్తున్నారు. జస్ట్ లిరికల్ విడియోలోనే ఇలా ఉంటే ఫుల్ సాంగ్ లో అది కూడా వెండితెరపై వీరిద్దరి స్టెప్పులు ఎలా ఉండబోతున్నాయో అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సాంగ్ క్రేజ్ ని ఆర్ఆర్ఆర్ మూవీ టీం కూడా క్యాష్ చేసుకుంటోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ సాంగ్ కి డాన్స్ కంపోజింగ్ చేశారు.

పాటకు తగ్గట్లుగా ఎన్టీఆర్, చరణ్ చేత మాస్ స్టెప్పులు వేయించారు. ఈ సాంగ్ కి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఎలా కొరియోగ్రఫీ అందించారో తెలిపేలా చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ తన అసిస్టెంట్స్ కి నాటు నాటు సాంగ్ డాన్స్ మూమెంట్స్ నేర్పిస్తున్నారు. ఈ వీడియో నెటిజన్లని బాగా ఆకట్టుకుంటోంది.

తారక్- చరణ్ రేంజులో నాటు స్టెప్పులతో మాస్ ని అలరించిన ప్రముఖ కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ స్టెప్పుల్ని మ్యాచ్ చేస్తూ నాటు నాటు ట్యూన్ ని సద్వినియోగం చేసిన తీరు ఆకట్టుకుంటోంది. చాలా మంది నెటిజనులు తమ అభిమాన స్టార్ హీరోల మాషప్ సాంగ్స్ కి నాటు నాటు ట్యూన్ ని జోడిస్తున్నారు.

వీటిలో కొన్ని క్లిప్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పునీత్ రాజ్ కుమార్ డ్యాన్సులతో నాటు నాటు కన్నడ వెర్షన్ మాషప్ ఈ తరహానే. పునీత్ గొప్ప అథ్లెట్ కం డ్యాన్సర్.. అతడి డ్యాన్సుల్లో బాడీ లాంగ్వేజ్ లో ఫ్లెక్సిబిలిటీ మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే. మైఖేల్ జాక్సన్ స్ఫూర్తితో అతడు మూన్ వాక్ ని అదరగొడతాడు. ఇక తారక్ చరణ్ లకు ధీటుగా డ్యాన్సులు చేయగల ప్రతిభావంతుడిగా నిరూపించుకున్నారు. కొందరు అభిమానులు అయితే అంతకుమించి నృత్య కదలికలను ప్రదర్శించగల ధీశాలి అని పొగిడేస్తారు.