Natraj Master: వెళుతూ వెళుతూ గుంట న‌క్క ఎవ‌రో చెప్పి వెళ్లిన న‌ట‌రాజ్ మాస్ట‌ర్

Natraj Master: బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం మంచి రంజుగా సాగుతుంది. నాలుగు వారాలు సక్సెస్‌ఫుల్‌గా ఈ షో పూర్తి కాగా, ఆదివారంతో నాగార్జున న‌టించిన నిన్నే పెళ్లాడ‌తా సినిమా యానివ‌ర్స‌రీ కావ‌డంతో ఇంట్లోని స‌భ్యులు ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలోని పాటలకు స్టెప్పులు వేసి ఇంప్రెస్ చేశారు. తన కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని కాంప్లిమెంట్‌ ఇచ్చాడు. తర్వాత నాగ్‌ సండేను ఫండే చేసేందుకు ఇంటిసభ్యులను రెండు టీములుగా విడగొట్టాడు.

Natraj Master Revealed the Fox in the Biggboss House
Natraj Master Revealed the Fox in the Biggboss House

శ్రీరామ్‌, నటరాజ్‌, యానీ, ప్రియ, మానస్‌, జెస్సీ, సిరి, రవి A టీమ్‌ కాగా మిగతావారు B టీమ్‌లో ఉన్నారు. గేమ్‌లో భాగంగా ప్రతి టీమ్‌లోనుంచి ఒక్కొక్కరు బాక్స్‌లో నుంచి చీటీ తీసి, అందులో వ‌చ్చిన పేరు విధంగా డ్రాయింగ్ చేయాలి. అది చూసి సదరు టీమ్‌ మెంబర్స్‌ సరైన ఆన్సర్‌ చెప్పాలి. కరెక్ట్‌ ఆన్సర్‌ గెస్‌ చేస్తే డ్రాయింగ్‌ వేసిన కంటెస్టెంట్‌ వారికి నచ్చినవాళ్లతో డ్యాన్స్‌ చేయొచ్చు.

ఈ క్రమంలో విశ్వ- ప్రియాంక సింగ్‌ నరుడా.. ఓ నరుడా సాంగ్‌కు రెచ్చిపోయి మరీ డ్యాన్స్‌ చేశారు. పింకీ విశ్వ చొక్కా విప్పేయగా.. అతడు ఆమెను ఎత్తుకుని, హత్తుకుని మరీ స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇలా అంద‌రు కూడా స‌ర‌దాగా డ్యాన్స్‌లు చేయ‌గా, ఈ గేమ్‌లో టీమ్‌ A గెలవగా, విజయానందంతో చిందులేసింది. తర్వాత యానీ మాస్టర్‌ సేఫ్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించాడు.

తర్వాత ఇంటిసభ్యులతో నాగ్‌ ‘దాక్కోదాక్కో మేక’ గేమ్‌ ఆడించాడు. ఇందులో ఎవరు పులి, ఎవరు మేక అని పేర్లు చెప్పిన నాగ్‌ 30 సెకన్లలో మేకను పట్టుకోకపోతే పులి చచ్చిపోతుందని, పులికి పనిష్మెంట్‌ ఉంటుందన్నాడు. ఒకవేళ మేకను పట్టుకుంటే మేక చచ్చిపోవడంతో పాటు వారికి పనిష్మెంట్‌ ఉంటుందని తెలిపాడు. మొదటగా పులిగా వచ్చిన శ్రీరామ్‌.. హమీదాను వేటాడి పట్టుకున్నాడు. తర్వాత జెస్సీని పట్టుకోవడంలో విఫలమైన శ్వేతను నాలుకతో ముక్కును టచ్‌ చేయాలన్నాడు నాగ్‌. కానీ శ్వేత ఎంత ప్రయత్నించినా ముక్కును అందుకోలేకపోగా సిరి చాలా ఈజీగా నాలుకతో ముక్కును తాకింది.

అనంతరం పులిలా వచ్చిన ప్రియాంక.. మానస్‌ను వెంటాడి వేటాడగా అతడు చిక్కకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో స్విమ్మింగ్‌ పూల్‌లో పడటంతో నాగ్‌తో సహా అందరూ షాకయ్యారు. తర్వాత అతడికేమీ కాలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆటలో ఓడిపోయిన మానస్‌ పదిసార్లు కప్ప గెంతులు వేశాడు.

తర్వాత ప్రియ.. ఎంతకూ సన్నీని పట్టుకోలేకపోవడంతో ఆమెను హూలా హూప్‌తో డ్యాన్స్‌ చేయమన్నాడు నాగ్‌. హూప్‌ను తిప్పడం సాధ్యపడని ప్రియ దాంతో డ్యాన్స్‌ చేయడానికి ముప్పు తిప్పలు పడింది. అనంతరం సిరి.. షణ్నును పట్టేసుకోగా ఓడిపోయిన షణ్ముఖ్‌తో బెల్లీ డ్యాన్స్‌ చేయించాడు నాగ్‌. పులిలా వచ్చిన కాజల్‌.. లోబో మీద పంజా విసరడంతో అతడు 15 పుషప్స్‌ చేయక తప్పలేదు.

అనంతరం రవి.. యానీ మాస్టర్‌ను ఇట్టే పట్టేసుకున్నాడు. దీంతో యానీ.. రవి చేతిలో ఓడిపోయానని డైలాగ్‌ చెప్తూ తీన్మార్‌ స్టెప్పులేసింది. తర్వాత సిరి సేవ్‌ అయినట్లు ప్రకటించగా సంతోషం పట్టలేకపోయిన షణ్ను సిరిని ఎత్తుకుని తిప్పాడు. చివరగా బావ, బావమరుదులైన లోబో, నటరాజ్‌ ఇద్దరే మిగలగా.. హార్ట్‌ బీట్‌ సౌండ్‌తో టెన్షన్‌ పెంచేసిన నాగ్‌.. నటరాజ్‌ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు. దీంతో లోబో, యానీ, హమీదా గుక్కపెట్టి ఏడ్చేశారు.

Natraj Master Revealed the Fox in the Biggboss House
Natraj Master Revealed the Fox in the Biggboss House

స్టేజీ మీదకు వచ్చిన నటరాజ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో తన జర్నీ చూసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. హౌస్‌లో నుంచి వెళ్తున్నానంటే నా భార్యకు నా అవసరం ఉందేమోనని అభిప్రాయపడ్డాడు. అనంతరం నటరాజ్‌.. హౌస్‌లోని కంటెస్టెంట్లకు జంతువుల పేర్లను సూచిస్తూ గేమ్‌ ఆడాడు. సిరి తన జోలికొస్తే కాటేసే పాము అని చెప్పాడు. లోబో ఎలుకలా దూరి కిచెన్‌లో అంతా తినేస్తాడని పేర్కొన్నాడు. విశ్వని ఊసరవెల్లితో పోల్చాడు.

శ్రీరామచంద్ర మూడోవారం నుంచి అమాంతం పెరిగిపోయాడని అతడిని మొసలితో పోల్చాడు. ప్రియాంక సింగ్‌.. అందరికీ ప్రేమతో వడ్డించే చిలక అని చెప్పుకొచ్చాడు. సింహం.. తానేనన్న నటరాజ్‌.. మానస్‌ గాడిదలా చాకిరీ చేస్తాడన్నాడు. రవి.. యాంకరింగ్‌ చేసిన తెలివితో ఆడుతున్నాడని అతడే గుంటనక్క అని వెల్లడించాడు. చివర్లో హమీదా.. నాగ్‌ వేసుకున్న టీ షర్ట్‌ మీద ఆశ పడటంతో హోస్ట్‌ దాన్ని తప్పకుండా ఇచ్చేస్తానని హమీ ఇచ్చాడు.