Natraj Master: న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఎంత పారితోషికం అందుకున్నాడో తెలుసా?

Natraj Master: బిగ్ బాస్ కార్య‌క్ర‌మంకి సంబంధించిన ఏ వార్త అయిన అభిమానుల‌కి ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఈ సీజ‌న్ నుండి మొత్తంగా న‌లుగురు ఎలిమినేట్ కాగా, వీరి పారితోషికం విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రెండో వారం ఎలిమినేట్ అయిన ఉమాదేవి ల‌క్ష‌న్న‌ర‌కి పైగా అందుకున్న‌ట్టు తెలుస్తుండ‌గా, అందులో కొత్త మొత్తాన్ని చిన్నారి వైద్యానికి అందించిన‌ట్టు స‌మాచారం.

Natraj Master Remuneration in Biggboss 5 for four weeks
Natraj Master Remuneration in Biggboss 5 for four weeks

ఈ వారం న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఎలిమినేట్ కాగా, ఆయ‌న‌కు సంబంధించిన వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. బిగ్‌బాస్‌ షోలోకి ఎంతో సీరియస్‌గా అడుగుపెట్టిన మాస్టర్‌ రానురాను జోకర్‌గా మారిపోయారు. టాస్క్‌ల్లో బాగానే పర్ఫామ్‌ చేసినప్పటికీ వింత బిహేవియర్‌ వల్ల కమెడియన్‌గా మారిపోయాడు. నేను మోనార్క్‌ను, నా మాటే అందరూ వినాలి, కానీ నేనెవరి మాటా వినను అన్నట్లుగా ప్రవర్తించడంతో అటు కంటెస్టెంట్లతో పాటు ఇటు జనాలకు కూడా విసుగు పుట్టించాడు.

ప్రతిసారి పక్కవాడిని టార్గెట్‌ చేస్తే మొదటికే మోసం వస్తుంది. అందుకు నటరాజ్‌ మాస్టర్‌ పెద్ద ఉదాహరణ. ఇంటిసభ్యులను జంతువులతో పోల్చడం, వాళ్లకు ఇష్టమున్నా లేకపోయినా ఎప్పటికప్పుడు కొత్త కొత్త జంతువుల పేర్లతో పిలవడం చాలామందికి నచ్చలేదు. ముఖ్యంగా తమ అభిమాన కంటెస్టెంట్లను జంతువులతో పోల్చినందుకు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో నటరాజ్‌ను దుమ్మెత్తిపోశారు. చివ‌ర‌కి హౌజ్ నుండి బ‌య‌ట‌కు పంపారు.

హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక నటరాజ్‌ మాస్టర్‌కు బిగ్‌బాస్‌ షో నుంచి ఎంత ముట్టిందన్నది చర్చనీయాంశంగా మారింది. ఫిలిం న‌గ‌ర్ స‌మాచారం మేర‌కు మాస్టర్‌కు రోజుకు ఇంచుమించు 15 వేల రూపాయలు ఇస్తామని డీల్‌ కుదర్చుకున్నారట! ఈ లెక్కన అతడు వారానికి లక్ష రూపాయల పైచిలుకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో అతడు నాలుగు వారాలున్నాడు, అంటే ఈ షో ద్వారా అతడు నాలుగు లక్షల పైనే వెనకేసుకున్నట్లు కనిపిస్తోంది. ముందు డీల్ ప్ర‌కారం క‌న్నా, ఎక్కువ‌గానే ముట్టిన‌ట్టు తెలుస్తుంది.