Balakrishna: బాల‌కృష్ణ‌ తో స్టెప్పులు వేయించిన న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌.. చ‌క్క‌ర్లు కొడుతున్న ఫొటో

Balakrishna: హీరోలు ఇప్పుడు వెండితెర‌పై అల‌రించ‌డ‌మే కాదు బుల్లితెర‌పై కూడా సంద‌డి చేస్తున్నారు. మ‌రో వైపు వెబ్ సీరీస్ లపై కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో నటీనటులు స్టార్ డమ్ ను లెక్క చేయకుండా మంచి కంటెంట్ దొరికోతే ఓటీటీ సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. బాలకృష్ణ మొదటిసారి ప్రత్యేకంగా ఒక టాక్ షోకు హోస్టింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

TheNewsQube-
Nataraj Master Choreograph to Balakrishna in NBK Show
Nataraj Master Choreograph to Balakrishna in NBK Show

అన్‌స్టాపబుల్ షో ద్వారా సరికొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్న బాలయ్య ఇటీవల ఒక ఈవెంట్ ద్వారా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవ‌ల ప్రోమో చిత్రీక‌రించ‌గా, దీనిని ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించారు. దర్శకుడు బీవీఎస్ రవి కూడా ఈ షో కంటెంట్ ను అందించినట్లు సమాచారం.

అన్‌స్టాపబుల్ షోలో మొదట కలెక్షన్ కింగ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నబోతున్నట్లు తెలుస్తోంది. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిన మోహన్ బాబు ఇప్పుడు బాలయ్యతో ఎలాంటి విషయాలు మాట్లాడతారో చూడాలి. దీపావళి రోజున మొదటి ఎపిసోడ్ ప్రసారం అయ్యే అవకాశం ఉందట.

షోకి సంబంధించి నేటి నుండి షూటింగ్ జ‌ర‌గ‌నుండ‌గా, ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌ కోసం న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణలో సాంగ్ చిత్రీక‌రించార‌ట‌. బాల‌య్య‌తో క‌లిసి న‌ట‌రాజ్ మాస్ట‌ర్ దిగిన పిక్ వైర‌ల్‌గా మారింది. మోహన్ బాబు వచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కూడా పాల్గొంటారని టాక్ అయితే వచ్చింది. ఇక ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కానీ మెగా హీరోలు మాత్రం కొందరు బాలయ్య టాక్ షోలో మనసువిప్పి మాట్లాడే అవకాశం ఉందట.

నందమూరి బాలకృష్ణకు అన్‌స్టాపబుల్ షోకు ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే మొత్తంగా ఆయనకు ఒక ఎపిసోడ్ కు 40 లక్షల వరకు అందుతుందట. మొత్తంగా 12 ఎపిసోడ్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వాటికి టోటల్ గా ఐదు కోట్ల వరకు బాలయ్యకు పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం.